హీరోయిన్ల మధ్య ఎంత పోటీ వాతావరణం ఉంటుందో! లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టుల మధ్య అంతకు మంచి పోటీ ఉంటుంది. ఆ పోటీని తట్టుకుని ముందుకెళ్లడం అంటే అంత ఈజీ కాదు. ట్యాలెంట్ తో పాటు…ఇక్కడ మాటకారితనం..మెప్పించే విధానం తెలిసిండాలన్నది నిపుణల మాట. రంగుల ప్రపంచం రోజుకో రంగు పులుముకుటుంది. ఈ స్పీడ్ ను అందుకోవాలంటే అంతే అప్డేడేట్ గాను ఉండాలంటారు. అదీ స్టార్ హీరోల చిత్రాల్లో తల్లి..అత్త..అక్క..చెల్లి..కోడలు వంటి సైడ్ క్యారెక్టర్లకు డిమాండ్ పోటీ గట్టిగానే ఉంటుంది. ఒక్క సినిమా పడి హిట్టు అయితే మరో సినిమాలో ఛాన్స్ తన్నుకుంటూ వస్తుంది అన్న ఓ సెంటిమెంట్ కూడా ఇక్కడ వర్కౌట్ అవుతుంది.
అయితే అవకాశం దక్కాలంటే మాటకారి తనంతో పాటు, మంచి పరిచయాలు కూడా అవసరం. అప్పుడే ఛాన్సులొస్తాయి. అయితే ఇటీవల హాట్ జూనియర్ ఆర్టిస్ట్ వరుసగా స్టార్ హీరో సినిమాల్లో నటిస్తోంది. ఒకప్పుడు అవకాశాలు అంటూ ఫిలిం మీడియా సర్కిల్ లో తిరిగే ఈ భామ ఇప్పుడసలు అటు వైపు కనిపించడం లేదు. వివరాలు ఆరా తీస్తే గేరు మార్చి స్పీడ్ పెంచిందని తెలిసింది. అవకాశాలు రాని రోజుల్లో కొంత మంది తనకన్నా సీరియర్ ఆర్టిస్టులపై కొన్ని అబాండాలు సైతం మోపడానికి వెనకాడలేదు. ఆ నటి అలా తిరగిందంటా? దర్శక, నిర్మాతల కోరిక మేరకు ఫలానా హోటల్ కి వెళ్లిందని ఆరోపణలు చేసే ప్రయత్నం చేసింది.
మరి మీరెందుకు అవకాశాలు అందుకోలేకపోతున్నారని ప్రశ్నిస్తే! నేను అలాంటిదాన్ని కాదని..కాలేజీలో పిల్లలకు పాఠాలు బోధించేదాన్ని…సినిమాలంటే ఫ్యాషన్ అంతే . ఇదే వృత్తిగా ఉండాలని ఇక్కడకు రాలేదని కాకమ్మ కబుర్లు చెప్పింది. కట్ చేస్తే ఆ పాఠాలు మానేసి అమ్మడు కొన్ని నెలలుకే అగ్ర హీరోల చిత్రాల్లో ఛాన్సులందుకోవడం మొదలు పెట్టింది. ప్రస్తుతం ఫుల్ బీజీ. అమ్మ..అక్క. వదిన పాత్రల్లో వెండి తెరను ఏల్తోంది. ఇక బుల్లి తెర సీరియల్స్ లోనూ అమ్మడు డేంజరస్ విలన్ పాత్రల్లో నటిస్తోంది.