కొన్నాళ్ళ క్రితం హీరోయిన్ కృతి శెట్టి గురించిన గాసిప్ ఒకటి అప్పట్లో హాట్ టాపిక్. దర్శకుడు ఓ సినిమా విషయంలో, కృతి శెట్టిని సెట్‌లోనే.. అందరి ముందరా తిట్టేశాడన్నది ఆ గాసిప్ సారాంశం. అయితే, అదంతా ఉత్తదేనని ఆ తర్వాత కృతి శెట్టితోపాటు ఆ దర్శకుడూ క్లారిటీ ఇచ్చేశాడు.
తాజాగా, మరో యంగ్ హీరోయిన్ విషయంలో ఇలాంటి గాసిప్పే ప్రచారంలోకి వచ్చింది. ఈసారి నిజమే.. నిజంగానే, ఓ ప్రముఖ దర్శకుడితో ఓ ప్రముఖ హీరోయిన్ చీవాట్లు తిన్నదనంటూ గుసగుసలు గుప్పుమంటున్నాయి.
ఎవరా హీరోయిన్.? ఏమా కథ.? ఓవర్ ఆటిట్యూడ్ ఆ దర్శకుడి సొంతమట. అదే, ఆయన్ని మిగతా దర్శకులకంటే భిన్నంగా చూపిస్తుందట. సెట్‌లో అతి చేస్తుంటాడట. ఆయనతో సినిమాలు చేయడానికి హీరోయిన్లు తటపటాయిస్తుంటారట కూడా.
డిజాస్టర్లు ఇచ్చినా, భారీ సక్సెస్‌లు.. పైగా, ఓ బలమైన సామాజిక వర్గం మద్దతు.. ఇవన్నీ అతని స్టార్‌డమ్‌ని నిలబెడుతున్నాయని అంటారు. ఇంతకీ, ఎవరా దర్శకుడు.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్. హీరోయిన్ విషయానికొస్తే, మల్టీ టాలెంటెడ్ ఆ హీరోయిన్. వంక పెట్టడానికేమీ లేదామెలో. మరెందుకు గొడవ.?