ఎన్టీఆర్ 31 సంజ‌య్ లీలా భన్సాలీతోనా?

NTR ట్రీట్: `టైగ‌ర్ ఫైట్` గ్లాడియేట‌ర్ రేంజులో?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ `ఆర్.ఆర్.ఆర్` చిత్రంతో పాన్ ఇండియా స్టార్ కాబోతున్నాడు. రామ్ చ‌ర‌ణ్‌- ఎన్టీఆర్ న‌టిస్తోన్న ఈ చిత్రానికి రాజమౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. బాహుబ‌లి త‌ర్వాత జ‌క్క‌న్న ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నాడు. బాక్సాఫీస్ వ‌ద్ద మ‌రో సంచ‌ల‌నానికి రెడీ అవుతున్నాడు. ఇది తార‌క్ కెరీర్ కి 29వ చిత్రం. పాన్ ఇండియా కేటగిరీలో ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఇక ఈ సినిమా త‌ర్వాత తార‌క్ 30వ చిత్రాన్ని గురూజీ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నాడు.

అయితే ఆర్.ఆర్.ఆర్ పూర్తి కాకుండానే 30వ సినిమా అప్ డేట్ అధికారికం కాకుండానే తార‌క్ పెద్ద స్కెచ్ తోనే ముందుకు వెళ్తున్నాడ‌ని తాజాగా ఓ వార్త హీటెక్కిస్తోంది. బాలీవుడ్ దిగ్గజ ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీతో త‌న 31 వ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్న‌ట్లు ఓ క‌థ‌నం హాట్ టాపిక్ అయ్యింది. ఇది సోషియా ఫాంట‌సీ ఫిల్మ్ అని…పాన్ ఇండియా రేంజ్ లో తెర‌కెక్కించ‌డానికి బ్యాకెండ్ వ‌ర్క్ జ‌రుగుతోంద‌ని ప్ర‌చారం సాగుతోంది. అలాగే ఇందులో విలన్ గా బాలీవుడ్ హీరో ర‌ణ‌వీర్ సింగ్ న‌టించ‌నున్నాడ‌ని అంటున్నారు. మ‌రి ఇందులో నిజం ఎంత‌? అన్న‌ది తెలియ‌దు గానీ…ఇదే నిజ‌మైతే తార‌క్ రేంజ్ ఒక్క‌సారిగా మారిపోవ‌డం ఖాయం.

ఆర్.ఆర్.ఆర్ విజ‌యం సాధిస్తే పాన్ ఇండియా స్టార్ అవుతాడు. అటుపై సంజ‌య్ లీలా భ‌న్సాలీతోను సోషియా ఫాంట‌సీ చేసి హిట్ కొడితే బుడ్డోడి వేగాన్ని ఆప‌డం ఎవ‌రి త‌రం కాదు అంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్లు మొద‌లైపోయాయి. సోషియా ఫాంట‌సీ చిత్రాల్ని తెర‌కెక్కించ‌డం భ‌న్సాలీకి కొట్టిన పిండి. చారిత్ర‌క చిత్రాల్ని అవ‌లీల‌గా చిత్రీక‌రించిన అనుభ‌వం ఉంది. చరిత్ర‌కు వెండి తెర‌పై అద్భుత‌మైన దృశ్య రూపం ఇవ్వ‌గ‌ల ద‌ర్శ‌కుడిగా అత‌డికి గౌర‌వం ఉంది. ఆ త‌ర‌హా క‌థ‌ల్లో తార‌క్ ఒదిగిపోయి న‌టించేందుకు వెన‌కాడ‌డు. అయితే స‌మ‌స్యంతా తార‌క్ ఎత్తు.. బ‌రువుతోనే! ఇలాంటి స్క్రిప్ట్ ల‌కు తార‌క్ సూటి కాడని ఓ వ‌ర్గం భావిస్తోంది. ఇలాంటి క‌థ‌ల‌కు ఒడ్డు…పొడుగు.. భారీ శ‌రీరం అవ‌స‌రం అవుతుంది. కానీ తార‌క్ లో ప్ర‌ధానంగా హైట్ స‌మ‌స్య అవుతుందేమోన‌ని ఓ విమ‌ర్శ వినిపిస్తోంది.