సీఎం సీఎం..ఆగండి బ్ర‌ద‌ర్…ఫ్యాన్స్‌పై ఎన్టీఆర్ సీరియ‌స్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్.. ఫ్యాన్స్‌కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వారిని సోద‌రుల‌లా భావించే ఎన్టీఆర్ తెల్ల‌వారితే గురువారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అభిమానుల‌పై గ‌రం అయ్యారు. ఆపండి బ్ర‌ద‌ర్.. స్టాప్ అంటూ కాస్త అస‌హ‌నం వ్యక్తం చేశారు. వివ‌రాల‌లోకి వెళితే ‘మత్తు వదలరా’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు శ్రీ సింహా కోడూరి హీరోగా తెల్ల‌వారితే గురువారం చిత్రం తెర‌కెక్కిన విష‌యం తెలిసిందే. మణికాంత్ జెల్లీ దర్శకత్వంలో వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మిస్తున్నారు.

ఆగండి బ్ర‌ద‌ర్ అంటూ ఫ్యాన్స్‌పై ఎన్టీఆర్ సీరియ‌స్

కాల భైర‌వ సంగీతం అందిస్తున్నారు. మార్చి 27న మూవీ విడుద‌ల చేయ‌నున్న క్ర‌మంలో ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక నిర్వ‌హించారు. ఈ వేడుక‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్య‌క్ర‌మంలో మాట్లాడిన ఎన్టీఆర్.. అభిమానుల అరుపుల‌కు చాలా ఎనర్జీ వ‌స్తుంది. అయితే చాలా త‌క్కువ సార్లు మాట్లాడ‌డంలో ఇబ్బంది ప‌డుతుంటాను. రేపొద్దున అభయ్, భార్గవ్ గానీ ఏదైనా సాధిస్తే వాళ్ల గురించి చెప్పాలంటే మాట్లాడాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఇప్పుడు తెలుస్తోంది. పిల్లలు సక్సెస్ అయితే తల్లిదండ్రులు ఎలా ఫీలవుతారో.. నా తమ్ముళ్లు సింహా, భైరవ సాధించిన విజయాలకు మాటలు సరిపోవడం లేదు. వారి గురించి చెప్పేందుకు మాటలు సమకూర్చుకుంటున్నాను.

నాకు 20 ఏళ్ల నుంచి దేవుడి ఇచ్చినట్టువంటి శక్తి మీరైతే.. నాకు తెలిసిన ఒకే ఒక కుటుంబం కీరవాణి, జక్కన్న కుటుంబం. నేను తీసుకునే ప్రతీ ఒక్క నిర్ణయం వెనక వాళ్లే ఉన్నారు. ఈ కుటుంబానికి నేను ఎప్పుడూ గెస్ట్‌ను కానూ కాకూడదు.. వారికి కూడా నేను అలా కాకూడదు. నిర్మాత సాయి గురించి కూడా అంతే ఫీలవుతున్నాను. ఈ మూవీ హిట్ అవ్వాలి.. దర్శకుడికి సక్సెస్ రావాలి.. సినిమాకు పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. మంచి తల్లిదండ్రులం అని ఎలా అనిపించుకోవాలి అని ఎన్టీఆర్ అన్నారు. అయితే ఎన్టీఆర్ మాట్లాడుతున్న స‌మ‌యంలో అభిమానులు సీఎం సీఎం అంటూ అర‌వ‌డంతో ఓపిక న‌శించిన జూనియ‌ర్, ఆగండి బ్ర‌ద‌ర్, స్టాప్ అంటూ కాస్త అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ .. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు చిత్రంతో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే.