‘ఆర్ఆర్ఆర్’ నుంచి క్రేజీ అప్‌డేట్స్

Crazy updates from RRR mmovie

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ లు హీరోలుగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ నుండి క్రేజీ అప్డేట్ వచ్చింది. బైక్‌ పై ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌ ఉన్న ఓ పోస్టర్‌ ను విడుదల చేస్తూ రెండు పాటలు మినహా షూటింగ్‌ మొత్తం పూర్తయినట్లు సోషల్‌ మీడియా ద్వారా చిత్రయూనిట్‌ వెల్లడించింది.

Crazy updates from RRR mmovie

‘బాహుబలి’ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం కోసం అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. కోవిడ్‌ కారణంగా షూటింగ్ కి గ్యాప్ ఇచ్చిన జక్కన్న ఇటీవలనే తిరిగి స్టార్ట్ చేశారు. ప్రధాన నటీ నటులు ఇప్పటికే తమ పాత్రలకి డబ్బింగ్ చెప్పటం మొదలెట్టేశారు. ఈ సినిమాకు సంబంధించిన అన్ని ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయ‌ని యూనిట్ తెలిపింది.

చిత్ర యూనిట్‌ ముందే ప్రకటించినట్లుగా అనుకున్న సమయానికే విడుదల చేస్తారా ? లేదా? అని అభిమానుల్లో చర్చ నడుస్తుంది. సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారట. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు చాలా ఎక్కువ సమయం పడుతుందట. అందుకే వచ్చే ఏడాది జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా లేదంటే సమ్మర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.