గుడ్ న్యూస్: మరో రియాలిటీ షోతో రాబోతున్న ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మరోసారి సెలబ్రేట్ చేసుకునే అవకాశం రాబోతోంది. టెలివిజన్ షోలో జూనియర్ ఎన్టీఆర్ మరోసారి కనిపించబోతునట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 1తో ఆడియెన్స్ కు ఎంతగానో కిక్కిచ్చిన తారక్ మళ్ళీ ఆ వైపు వెళ్లలేదు. షూటింగ్స్ తో బిజీగా ఉండడం వలన ఇన్నాళ్లు రియాలిటీ షోల వైపు మొగ్గు చూపని తారక్ ఇప్పుడు RRR సినిమాతో పాటే ఒక షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నట్లు సమాచారం.

జెమిని టీవీ చానెల్ నిర్వహించబోయే ఆ సరికొత్త షో కోసం ఇప్పటికే అన్నపూర్ణలో రెండు ఫ్లోర్లను కూడా బుక్ చేసినట్లు తెలుస్తోంది. భారీ సెట్ లో షూటింగ్ నిర్వహించబోతున్నట్లు టాక్. ఇక దాదాపు RRR షూటింగ్ కూడా చివరి దశలోకి వస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ కు సంబంధించిన మేజర్ సీన్స్ కూడా ఫినిష్ అయ్యే దశలోనే ఉన్నాయి. కాస్త ఫ్రీ అయితే టాక్ షోను స్టార్ట్ చేయాలని భావిస్తున్నారట. బిగ్ బాస్ సీజన్ 4కోసం ఆల్ మోస్ట్ తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని గతంలో అనేక రకాల రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే.

కానీ ఈ సారి కూడా నాగార్జున ఫిక్స్ అని ట్విస్ట్ ఇచ్చారు. ఇక ఇప్పుడు జెమిని టీవీ మాత్రం భారీగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 1తో అదరగొట్టిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మరింతగా ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే షోకు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా రానున్నట్లు టాక్ అయితే వస్తోంది. ఇక RRR అనంతరం జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.