ఇన్సైడ్ టాక్ ..ఎన్టీఆర్ – బుచ్చిబాబుల భారీ ప్రాజెక్ట్ మొదలు అప్పుడేనట.!

టాలీవుడ్ బిగ్గెస్ట్ మాస్ హీరోస్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఉన్న మాస్ ఫాలోయింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. అయితే ఎన్టీఆర్ ఇప్పుడు హీరోగా వరుసగా మూడు సినిమాలు ఓకే చేసేసాడు. మరొక చిత్రం ప్రోగ్రెస్ లో ఉంది. ఇక ఈ భారీ లైనప్ లో అయితే అనధికారికంగా కంఫామ్ అయ్యిన చిత్రం మాత్రం ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సాన తో ఉంది.

ఎన్టీఆర్ 31 లేదా 32 సినిమాగా ఇది ఉండొచ్చని ఇప్పుడు వార్తలు తెలుస్తుండగా ఈ సినిమా స్క్రిప్ట్ పని ని కూడా రీసెంట్ గానే దర్శకుడు రివీల్ చేసాడు. ఇక ఈ భారీ సినిమాపై అయితే లేటెస్ట్ గా ఓ సమాచారం బయటకి వచ్చింది. ఈ కాంబోలో ఈ చిత్రం అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ లో కానీ జనవరి మూడో వారం లో కానీ ఈ చిత్రం స్టార్ట్ అవుతుందని బజ్ వినిపిస్తుంది.

మొత్తానికి అయితే ఈ సినిమాపై క్లారిటీ ఇలా ఉంది. మరి ఈ సినిమా ఒక స్వచ్ఛమైన నేపథ్యంలో అది కూడా పీరియాడిక్ గానే ఉంటుంది అని తెలుస్తుంది. వీటితో పాటుగా ఎన్టీఆర్ అయితే ఒక స్పోర్ట్స్ పర్సన్ గా చాలా స్టన్నింగ్ లుక్ లో కనిపించనున్నాడని అంటున్నారు. మరి ఈ సినిమాపై అయితే మరిన్ని డీటెయిల్స్ రావాల్సి ఉంది.