తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితగారి జీవితం ఆధారంగా భారీ స్థాయిలో బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో రానున్న ఈ ‘తలైవి’ కోసం షూటింగ్ కి ప్లాన్ చేస్తున్నారు. కరోనా ప్రభావం ఇప్పట్లో తగ్గే సూచనలు లేకపోవడంతో తక్కువమంది సిబ్బందితో షూట్ చేస్తారట. చెన్నైలోని ఓ స్టూడియోలో వచ్చే నెల ఫస్ట్ వీక్ నుండి జరగబోయే షెడ్యూల్ లో ప్రకాష్ రాజ్ మరియు కంగనా మీద అసెంబ్లీ సన్నివేశాలను షూట్ చేయబోతున్నారు. జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలలో అసెంబ్లీలో ఆమె చీర పట్టుకుని లాగడం ఒకటి. సినిమాలోనే ఈ సీన్ అత్యంత కీలకమైనది. ఈ సన్నివేశాన్నే తీయనున్నారు.
ఇక తెలుగు కన్నడ మలయాళ పరిశ్రమల్లో కూడా ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి. అందుకే ఈ బయోపిక్ బడ్జెట్ వంద కోట్లు అట. కంగనా రనౌత్ కి బాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉందని పైగా అమ్మ బయోపిక్, తమిళంలో కూడా భారీ డిమాండ్ ఉంటుంది. కాబట్టి వంద కోట్లుపెట్టినా ఈజీగా రికవరీ అవుతాయని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. ఇక కంగనా రనౌత్ ను అచ్చం అమ్మలా మార్చెందుకు హాలీవుడ్ మూవీ ‘డార్కెస్ట్ హవర్’కి మేకప్ మెన్ గా పనిచేసిన ‘గ్యారీ ఓల్డ్ మెన్, ‘అమ్మ’ బయోపిక్ కూడా చేస్తున్నారు. కాకపోతే కరోనా కారణంగా వాళ్ళు మధ్యలోనే సినిమా నుండి తపుకోవాల్సిన పరిస్థతి.
జయలలిత జీవితంలోని కీలకమైన పాత్రలు ఎం.జి.రామచంద్రన్ మరియు కరుణానిధి పాత్రలు. కాగా ఈ సినిమలో ఎం.జి.రామచంద్రన్ పాత్రలో అరవింద్ స్వామి నటించబోతుండగా.. అదే విధంగా మరో కీలక పాత్ర మాజీ సీఎం కరుణానిధి పాత్రలో నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడు. మరి జయలలిత లాంటి బలమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలంటే మంచి నటి ఉండాలి కదా, కంగనా రనౌత్ లాంటి బలమైన నటి అయితేనే జయలలిత పాత్రకు పూర్తి న్యాయం జరుగుతుంది. మరి ఎప్పుడూ వివాదాస్పద విషయాలతో తన ఘాటైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే కంగనా రనౌత్ జయలలిత పాత్రను ఎలా మెప్పిస్తోందో !