ఎక్స్‌క్లూజివ్‌: జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌, షూటింగ్ డేట్ ఫిక్స్‌

(ధ్యాన్)

ప్ర‌స్తుతం సినీ రంగం అంతటా బ‌యోపిక్ ట్రెండ్ న‌డుస్తుంది. ప్రముఖ రాజ‌కీయ‌, సినీ, క్రీడాకారుల జీవిత చ‌రిత్ర‌లు సినిమాల రూపంలో వ‌స్తున్నాయి. ఇదే ట్రెండ్‌లో త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేసిన `అమ్మ‌` జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌కి రంగం సిద్ధ‌మవుతుంది.

కొన్ని రోజులుగా జ‌య‌ల‌లిత బ‌యోపిక్ రూపొందుతుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతూ వ‌స్తున్నాయి. తాజాగా సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు స్టార్ట్ అయ్యాయి. ఈ బ‌యోపిక్‌ను ద‌ర్శ‌కుడు ఎ.ఎల్‌.విజ‌య్ తెర‌కెక్కించ‌బోబోతున్నాడు. ఇంత‌కు నిర్మాత ఎవ‌రో తెలుసా? ఇప్ప‌డు ఎన్టీఆర్ బయోపిక్ `య‌న్‌.టి.ఆర్‌` లో కీలకమైన విష్ణు ఇందూరి శ్రీమ‌తి బ్రిందా ప్ర‌సాద్.

జ‌య‌ల‌లిత పుట్టిన‌రోజు ఫిబ్ర‌వ‌రి 24న ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇందులో ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి హీరోయిన్ జ‌య‌ల‌లిత‌గా న‌టించ‌నున్నారు. త్వ‌ర‌లోనే మ‌రికొన్ని వివ‌రాలు తెలియ‌నున్నాయి.