మెగా హీరో టైటిల్ ..మీడియా వండిన వార్తేనా?

మెగా మేనల్లుడు, సాయి ధరమ్‌ తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్ రైటింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

ఈ చిత్రానికి సంభందించి వదిలిన ప్రీ లుక్‌తోనే ఆకట్టుకుంది టీమ్. ఇప్పుడు చిత్రం టైటిల్ విషయంలోనూ అదే స్టైల్ లో ఆలోచిస్తోంది చిత్రయూనిట్. ఈ సినిమాకు ‘జాలరి’ అనే టైటిల్ పెట్టనున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియలేదు.

సినిమా ప్రీలుక్‌లో వైష్ణవ్‌ జాలరిగా కనిపించాడు. దాంతో మీడియాలో ఓ వర్దం ఈ టైటిల్ ని ప్రచారంలోకి తెచ్చిందా లేక…అసలు ఈ టైటిల్ పెడితే ఎలా ఉంటుందా అని సినిమాకు సంభందించిన టీమ్ ఓ వార్త వదిలిందా అనేది తెలియరాలేదు. ప్రస్తుతానికి ఈ టైటిల్ గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో తమిళ హీరో విజయ్ సేతుపతి విలన్ రోల్లో నటించనున్నాడు. చిత్రబృందం ఇటీవల ఈ విషయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.