ఇట్టిమాణి గా మోహన్ లాల్

మోహన్ లాల్ సినిమాలు ప్రత్యేకంగా ఉంటాయి.‘ఒడియన్, లూసిఫర్‌’ సినిమాలలో పూర్తి సీరియస్‌ పాత్రలను చేశారు మోహన్‌లాల్‌. ప్రస్తుతం వాటికి భిన్నంగా పూర్తిస్థాయి హాస్య చిత్రం చేశారు. ‘ఇట్టిమాణి గా మేడ్‌ ఇన్‌ చైనా’ అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కింది. జిబి జోజు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. చైనా దేశ మూలాలున్న త్రిచూర్‌ క్రిస్టియన్‌ పాత్రలో మోహన్‌లాల్‌ నటించారు. ఈ సినిమా షూటింగ్‌ చాలా వరకు పూర్తయింది. హనీ రోస్, రాధికా శరత్‌కుమార్, సిద్ధిఖీ ముఖ్య పాత్రల్లో నటించారు. త్వరలోనే సినిమా రిలీజ్‌ కానుంది. ఈ సినిమా తెలుగు తమిళ మరియు మలయాళం లో రిలీజ్ చేశే ప్రయత్నం లో ఉన్నారు.