వెంక‌టేష్ జోరు.. మ‌రో రీమేక్‌పై క‌న్నేసిన నార‌ప్ప‌

సీనియ‌ర్ హీరో వెంక‌టేష్ ట్రెండ్ మార్చారు. మ‌ల్టీ స్టారర్ చిత్రాలు లేదా రీమేక్‌ల‌పై ఎక్కువ‌గా దృష్టి క‌న‌బ‌రుస్తున్నారు. ప్ర‌స్తుతం శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో నార‌ప్ప అనే చిత్రం చేస్తుండ‌గా,ఈ సినిమాకు సంబంధించి విడుద‌లైన పోస్ట‌ర్స్ ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలు క‌లిగించాయి. ధనుశ్ హీరోగా హిట్టైన ‘అసురన్’ మూవీకి రీమేక్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని మే 14న విడుద‌ల చేయ‌నున్నారు. ఇది పూర్తిగా గ్రామీణ నేప‌థ్యంలో తెర‌కెక్కుతుంది. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య‌కు పోటీగా బ‌రిలో దిగుతుండడం విశేషం. ఆచార్య మే 13న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే.

నార‌ప్ప సినిమాతో పాటు వెంక‌టేష్ అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ ఎఫ్ 3 అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమా ఆగ‌స్ట్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. వ‌రుణ్ తేజ్ ఈ చిత్రంలో మ‌రో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇక వెంక‌టేష్ గ‌తంలో పెళ్ళి చూపులు చిత్రంతో అంద‌రి దృష్టి ఆక‌ర్షించిన త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ సినిమా ఎప్పుడు మొద‌లవుతుంది, ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది అని అభిమానుల‌లో ఆనేక ఆలోచ‌న‌లు ఉండగా, దీనిపై తాజాగా ఓ క్లారిటీ వ‌చ్చింది.

వెంక‌టేష్ హీరోగా గుర్రపు పందాల నేపథ్యంలో త‌రుణ్ భాస్క‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడు. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి లో పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకొని ఆగ‌స్ట్‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న‌ట్టు తెలుస్తుంది. అయితే మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ అయిన దృశ్యం సినిమాను వెంక‌టేష్ తెలుగులో రీమేక్ చేశాడు. ఇప్పుడు దృశ్యం 2 చిత్రాన్ని కూడా చేయాల‌ని అనుకుంటున్న‌ట్టు స‌మాచారం. దృశ్యం 2 చిత్రం లాక్‌డౌన్ వ‌ల‌న ఓటీటీలో విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రీమేక్ హక్కులను సురేష్ ప్రొడక్షన్ కైవసం చేసుకుంది.