స‌లార్ చిత్రం మ‌ల్టీ స్టార‌ర్ కానుందా.. లేటెస్ట్ అప్‌డేట్‌తో మ‌రింత పెరిగిన అంచ‌నాలు

బాహుబ‌లి కోసం ఐదేళ్ళ స‌మ‌యం కేటాయించిన ప్ర‌భాస్ ఆ సినిమా త‌ర్వాత వ‌రుస‌గా సినిమాలు చేయ‌డం మొద‌లు పెట్టేశాడు. ఇవ‌న్నీ కూడా భారీ బ‌డ్జెట్‌తో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రాలే. రాధేశ్యామ్ అనే చిత్ర షూటింగ్‌ని పూర్తి చేసిన ప్ర‌భాస్ జ‌న‌వ‌రి నుండి ఆదిపురుష్‌, స‌లార్ సినిమాలు చేయ‌నున్నాడు. వీటితో పాటు నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో పీరియాడిక‌ల్ ప్రాజెక్ట్ కూడా చేయ‌నున్నాడు. అయితే ఇటీవ‌ల స‌లార్ సినిమా పోస్ట‌ర్ రిలీజ్ చేస్తూ ఈ సినిమాకి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయగా, ఈ మూవీపై అనేక ఆస‌క్తిక‌ర క‌థాంశాలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

స‌లార్ చిత్రం ప్యాన్ ఇండియా మూవీగా తెర‌కెక్క‌నుండ‌గా, ఈ చిత్రాన్ని కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించ‌నున్నారు. అగ్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. భారీ బడ్జెట్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్ తో ప్యాన్‌ ఇండియా సినిమాగా స‌లార్‌ని చిత్రీక‌రించ‌నున్నారు. అత్యంత క్రూరుడిగా పిలవబడే ఓ వ్యక్తి కథతో ‘సలార్‌’ను రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో కథానాయిక ఎవ‌రు, విల‌న్ ఎవ‌రు ఇలాంటి అంశాలపై జోరుగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. లోఫ‌ర్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌లుక‌రించిన దిశా ప‌టానీ.. స‌లార్ లో క‌థానాయిక అని అంటున్నారు.

తాజాగా మ‌రో ఆస‌క్తిక‌ర అప్‌డేట్ అంత‌ర్జాలంలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ప్ర‌భాస్‌తో పాటు మ‌రో స్టార్ హీరో కూడా ఇందులో న‌టిస్తార‌ని అత‌ను మ‌ల‌యాళ మెగాస్టార్ మోహ‌న్ లాల్ అని అంటున్నారు. ప్రభాస్‌ పాత్రకు ధీటుగా మెగాస్టార్ మోహన్‌ లాల్‌ పాత్రని ప్ర‌శాంత్ నీల్ డిజైన్ చేశాడ‌ని టాక్. ఈ వార్త నిజ‌మైతే స‌లార్ చిత్రం భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న మ‌ల్టీ స్టార‌ర్ కావ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. మోహ‌న్ లాల్ ఒక‌వైపు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నటిస్తూనే మ‌రోవైపు స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్‌లో అలరిస్తున్నారు. ఆ మ‌ధ్య జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో క‌లిసి జ‌న‌తా గ్యారేజ్ అనే చిత్రం చేయ‌గా, ఈ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టింది.