“ఇష్టంగా ” ఫస్ట్ లుక్ విడుదల 

ఎ.వి.ఆర్ మూవీ వండర్స్ పతాకంపై సంపత్ .వి.రుద్ర దర్శకత్వంలో  అడ్డూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తొన్న చిత్రం‌ “ఇష్టంగా”. అర్జున్ మహి, తనిష్క్ రాజన్ జంటగా నటిస్తున్నారు.  చిత్రీకరణ పూర్తయింది. రొమాంటిక్  లవ్  ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతొన్న ఈ సినిమా లొ ప్రియదర్శి ఓ ముఖ్య పాత్ర పొషిస్తున్నాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

దర్శకుడు సంపత్ .వి మాట్లాడుతూ.. ఇష్టంగా ఓ రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్. నేటి జనరేషన్ లో ప్రేమకున్న, ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఎంటన్న కాన్సెప్ట్ తో ఈ చిత్రం ఔట్ ఎండ్ ఔట్ యూత్ ఫుల్ మూవీ గా రూపొందుతొంది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలొనె లో “ఇష్టంగా ” చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని నిర్మాత అడ్డూరి వెంకటేశ్వర రావు తెలిపారు

 

అర్జున్ మహి, తనిష్క్ రాజన్, ప్రియదర్శి, దువ్వాసి మోహన్, తాగుబోతు రమేష్, మధునందన్, మధుమణి, విశ్వేష్వర్ నెమిలకొండ, ఫిష్ వెంకట్  తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి రచన సహకారం: చిట్టి శర్మ , సినిమాటోగ్రఫీ: ఆనంద్ నడకట్ల, సంగీతం: యేలేంద్ర మహావీర్, కూర్పు: బొంతల నాగేశ్వర్ రెడ్డి, మాటలు: శ్రీనాధ్ బాదినేని,  పాటలు: చంద్రబోస్, కందికొండ, ఆర్ట్: విజయ్ కృష్ణ, ఫైట్స్:’ షావలిన్’ మల్లేష్, పి.ఆర్.ఓ: సాయి సతీష్, నిర్మాత : అడ్డూరి వేంకటేశ్వర రావు, కథ- స్క్రీన్ ప్లే – దర్శకత్వం: సంపత్ .వి.రుద్ర