నైజాంలో `పోకిరి`ని టచ్ చేశాడు
రామ్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ మూవీ `ఇస్మార్ట్ శంకర్` ఇటీవలే రిలీజై చక్కని విజయం సాధించిన సంగతి తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత మాస్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా రామ్ కి, పూరికి ఆకలి తీర్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అద్భుత వసూళ్లను సాధిస్తోంది. ఇక ఓవరాల్ గా ఈ చిత్రం 8 రోజుల్లోనే 61 కోట్ల మేర ప్రపంచవ్యాప్త గ్రాస్ వసూలు చేసిందని చిత్రయూనిట్ అధికారిక పోస్టర్ ని రిలీజ్ చేసింది.
నైజాంలోనూ రామ్ కెరీర్ రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లు సాధించింది. ఈ సినిమా ఇప్పటికే నైజాంలో 12 కోట్ల మార్క్ ని అందుకుంది. గురువారం నాడు నైజాం నుంచి మరో 35లక్షల వసూళ్లు దక్కాయని ట్రేడ్ రిపోర్ట్ అందింది. దీంతో ఇదివరకూ మహేష్ పోకిరి పేరిట ఉన్న 12 కోట్ల మార్క్ ని ఇస్మార్ట్ శంకర్ టచ్ చేసినట్టయ్యింది. ఇక ఇప్పటికే ఓవరాల్ గా 32 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ చిత్రం ఫుల్ రన్ లో 40 కోట్ల షేర్ వసూలు చేసే వీలుందని అంచనా వేస్తున్నారు. గ్రాస్ 80 కోట్ల మేర వసూలయ్యే వీలుందని ట్రేడ్ విశ్లేషిస్తోంది. మెమరీ చిప్ ద్వారా ఒకరి బ్రెయిన్ లోకి ఇంకొకరి జ్ఞాపకాల్ని పంపడం అనే కొత్త కాన్సెప్టుతో పూరి మార్క్ లో తెరకెక్కిన ఈ సినిమాకి ఇటు నైజాం అటు ఆంధ్రాలోనూ ఆదరణ దక్కుతోంది. ఆ క్రమంలోనే పూరి- ఛార్మి బృందం ప్రచారం పరంగానూ వేడెక్కిస్తున్న సంగతి తెలిసిందే.