‘ఇస్మార్ట్ శంక‌ర్’ ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్ (ఏరియావైజ్)

‘ఇస్మార్ట్ శంక‌ర్’ ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్ (ఏరియావైజ్)

రిలీజైన ఫస్ట్ వీకెండ్ నాలుగు రోజులు బాక్స్ ఆఫీస్ ని పూర్తిగా తన కంట్రోల్ లోకి తీసుకున్న ఇస్మార్ట్ శంకర్ ఆ తర్వాత కూడా తన హవా ప్రదర్శించాడు. అయితే సోమవారం నుంచి శుక్రవారం దాకా మెల్లిమెల్లిగా చాలా చోట్ల డ్రాప్ కనపడింది. అయితే ఎలాంటి సినిమాకు అయినా వీక్ డేస్ లో ఇది కామన్ థింగ్ కాబట్టి ట్రేడ్ లైట్ తీసుకుంది.

ఫస్ట్ వీకెండ్ కే తెలుగు రాష్ట్రాల్లో చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యిందనే టాక్ ఉండగా ఆ తర్వాత నుంచి తెగే ప్రతి టికెట్ లాభం కిందకే వచ్చిందని అంటున్నారు. ట్రేడ్ వర్గాలు చెప్పుకునేదాని ప్రకారం థియేట్రికల్ బిజినెస్ 16 కోట్లకు అటుఇటుగా చేయడంతో రీజనబుల్ ప్రాఫిట్స్ తో కొన్నవాళ్ళు సేఫ్ కావడమే కాక లాభాలతో బయిటపడటం ఖాయమే. ఫస్ట్ వీక్ ప్రపంచవ్యాప్తంగా 29.11 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఏరియావైజ్ బ్రేకప్ లిస్ట్ ఇక్కడ:

ఏరియా షేర్ (కోట్లలో)

——————– —————————————-

నైజాం 11.59

సీడెడ్ 4.49

నెల్లూరు 0.90

కృష్ణా 1.59

గుంటూరు 1.62

వైజాగ్ 2.98

ఈస్ట్ గోదావరి 1.61

వెస్ట్ గోదావరి 1.33

ఆంధ్రా మరియు తెలంగాణా 26.11

కర్ణాటక 1.55

భారత్ లో మిగతా ప్రాంతాలు 0.45

ఓవర్ సీస్ 1.00

మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 29.11

యుఎస్ లో ఇస్మార్ట్ శంకర్ ఎలాంటి ప్రభావం చూపలేకపోతున్నాడు. వీక్ ఎండ్ లో మూడు రోజులు కలిపి ప్రీమియర్ షోతో సహా కేవలం $215K మాత్రమే వసూలు చేయడం అక్కడి ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదని చెబుతోంది. దీని కన్నా బ్రోచేవారెవరుగా ఫస్ట్ వీక్ లో ఓ ఇరవై వేల డాలర్లు ఎక్కువ రావడం గమనార్హం. ఇండియాలో వస్తున్న రన్ కి ఓవర్సీస్ పెర్ఫార్మన్స్ కు ఏ మాత్రం పొంతన లేదు. అక్కడ మాస్ సినిమాలు ఆడేది తక్కువనే విషయం తెలిసిందే.