మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి చిత్రానికి రిలీజ్ కష్టాలు తప్పడం లేదా? అంటే అవుననే తాజా సన్నివేశం చెబుతోంది. వాల్మీకి బోయ కమ్యూనిటీని అవమానపరుస్తూ ఆ టైటిల్ ని ఇలాంటి క్రూరత్వం నిండిన సినిమాకి.. క్యారెక్టర్ కి పెడతారా? అంటూ విరుచుకుపడుతున్నారు. ఆ మేరకు వాల్మీకి కమ్యూనిటీ పేరుతో రాజకీయ నాయకుల వీరంగం తెలిసిందే. అయితే ఆరు నూరైనా అసలు టైటిల్ మార్చే ప్రసక్తే లేదన్నట్టుగానే ఉంది చిత్రయూనిట్ పరిస్థితి.
అయితే ఈనెల 20న సినిమా రలీజవుతుందా అవ్వదా? కోర్టులో న్యాయమూర్తులు ఏం తేల్చారు? అంటే.. దానికి సరైన క్లారిటీ లేదు. నాలుగు వారాల్లోగా దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా చిత్రయూనిట్ కి నోటీసులు అందాయని తెలుస్తోంది. అలాగే ఫిలింఛాంబర్- సెన్సార్ బృందం సహా అందరికీ నోటీసులు అందడం చూస్తుంటే అసలేం జరుగుతోంది? అన్న సందిగ్ఢం కలుగుతోంది. ఇంతకీ వాల్మీకి రిలీజవుతుందా అవ్వదా? అన్నది సస్పెన్స్ గా మారింది. నాలుగు వారాల వరకూ వేచి చూశాక రిలీజ్ చేయాలా? లేక ఈలోగానే రిలీజ్ చేసుకుని ఇంకా విచారణ ఫర్వం కొనసాగిస్తారా? అన్నదానిపైనా సరైన క్లారిటీ లేదు. దీనిపై చిత్రయూనిట్ అధికారికంగా ఏదైనా వివరణ ఇస్తుందేమో చూడాలి. వాల్మీకి చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా.. 14 రీల్స్ సంస్థ నిర్మించింది.