పవన్ కళ్యాణ్ కెరీర్ కె బిగ్ ప్లాప్ ఇచ్చాడు అతనితో మెగాస్టార్ సినిమా ?

పవన్ కళ్యాణ్ కెరీర్ లో బెగ్గెస్ట్ హిట్ సినిమాలలో గబ్బర్ సింగ్ సినిమా కూడా ఒకటి. చెప్పాలంటే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన దబాంగ్ సినిమాకి రీమెక్ గా గబ్బర్ సింగ్ తెరకెక్కింది. ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా హరీష్ శంకర్ కెరీర్ లో కూడా పెద్ద హిట్ అని చెప్పాలి. ఇక అప్పటి వరకు ఐరెన్ లెగ్ అన్న పేరుతో సరైన అవకాశాలు లేని శృతి హాసన్ కూడా ఈ సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారింది. అయితే ఈ సినిమా తర్మాత మళ్ళీ పోలీస్ బ్యాక్ డ్రాప్ లో సర్దార్ గబ్బర్ సింగ్ వచ్చింది. కాగా ఈ సినిమాకి కూడా చాలామంది హరీష్ శంకర్ ఏ దర్శకుడని భావించారు.

చాలామందికి ఇప్పటికే అదే భావనలో ఉన్నారు. కాని సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా దర్శకుడు బాబీ. రవితేజ తో పవర్ సినిమా తీసి హిట్ అందుకోవడంతో పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం అందుకున్నాడు. కాని ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో జై లవ కుశ తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత వెంకటేష్ – నాగ చైతన్య లతో వెంకీమామా తీసి హిట్ అందుకున్నాడు. ఇలా రెండు బ్లాక్ బస్టర్స్ రావడంతో ఏకంగా మెగాస్టార్ తో సినిమా చేసే అవకాశం అందుకున్నాడు బాబీ.

ప్రస్తుతం మెగాస్టార్ ఆచార్య సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి రెడీగా ఉన్నారు. లాక్ డౌన్ లో వరుసగా కథల్ని.. దర్శకుల్ని ఫైనల్ చేసి వరసగా ప్రాజెక్ట్స్ ని లైనప్ చేసుకున్నారు. కొరటాల – మోహన్ రాజా – మెహర్ రమేష్ – బాబి లతో సినిమాలను చేస్తున్నట్టు వెల్లడించారు. దర్శకుడు బాబీతో ఒక స్ట్రెయిట్ సినిమాని చేయనున్నారు. ఉప్పెన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ మరోసారి ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారు. దీంతో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అధికారికంగా చిరు-బాబి మూవీని ప్రకటించింది. అయితే పవన్ కళ్యాణ్ కి ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడు మెగాస్టార్ కి హిట్ ఇవ్వగలడా అంటూ మాట్లాడుకుంటున్నారట. చూడాలి మరి ఏం జరుగుతుందో.