షాకింగ్ : ఎన్టీఆర్ ని కావాలని ఇరికించే ప్రయత్నం జరుగుతుందా?

గత రెండు రోజులు నుంచి కూడా ఏపీలో సహా సినీ వర్గాల్లో ఎలాంటి వాతావరణం నెలకొందో చూస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏపీలో జరిగిన ఓ ఇష్యూ పై తన మాట తాను చెప్పగా అది కాస్తా ఎటెటో వెళ్ళిపోతుంది. దీనితో రాజకీయాలు పరంగా కూడా తన పోస్ట్ సంచలనంగా మారగా అది కాస్తా..

ఇప్పుడు నందమూరి వర్సెస్ నారా గా మారిపోయింది. రాజకీయం పరంగా ఎన్టీఆర్ పై ప్రెజర్స్ ఇప్పుడు ఎక్కువ అవుతుండగా ఎన్టీఆర్ ని కొందరు టీడీపీ వర్గాలు అయితే కొంత తీవ్ర స్వరంతో విమర్శిస్తుండగా ఎన్టీఆర్ అభిమానులు అయితే ఈ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గడంలేదు.

దీనితో సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ మరియు ట్రెండ్స్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తున్నారు. నారా వారు ఎప్పటికీ ఎన్టీఆర్ కిందే అన్నట్టుగా సెన్సేషనల్ ట్రెండ్ చేస్తుండడం ఇప్పుడు నేషనల్ వైడ్ ట్రెండింగ్ లో నిలిచింది. దీనితో అయితే క్లియర్ గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ నారా వారితో విభేదిస్తున్నారని అర్ధం అవుతుంది.

అలాగే ఇంకో పక్క పాలిటిక్స్ లో కూడా ఎన్టీఆర్ ని అందరు కలిసి టార్గెట్ చేస్తూ ఎన్టీఆర్ ఇలా చెయ్యాలని తమ ఉద్దేశాన్ని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. దీనితో ఎన్టీఆర్ సినీ కెరీర్ పై కూడా ప్రభావం బాగా పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. మరి ఇది అయితే ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుంది అనేది చూడాలి. అలాగే ఎన్టీఆర్ ఏమన్నా పుల్ స్టాప్ దీనికి పెడతాడేమో అని కూడా చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.