పెళ్లికి రెడీ అయిన సాయి ధరమ్ తేజ్.. టాలీవుడ్‌లో ప్రస్తుతం పెళ్లి కళ ఉట్టిపడుతోంది. వరుసగా సెలెబ్రిటీల పెళ్లిళ్లు జరగడం, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ లిస్ట్‌లోంచి ఒక్కొక్కరుగా బయటకు రావడం చూస్తూనే ఉన్నాం. నిఖిల్, నితిన్, రానాలు లాక్ డౌన్, కరోనా అనేవి లెక్క చేయకుండా మొత్తానికి ఒకింటి వారయ్యారు. తాజగా మరో హీరో కూడా పెళ్లి పీఠలు ఎక్కబోతోన్నాడు. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ పెళ్లి చేసుకోబోతోన్నాడనే వార్త సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది.
తాజాగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ చేసిన ట్వీట్‌పై నెటిజన్స్ భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఇంతకీ తేజు చేసిన ట్వీట్ ఏంటంటే..‘ ఒక్కో సారి మనం ఎన్నో అనుకుంటాం కానీ ఆ టైం వచ్చినప్పుడు మరి’.. అంటూ ఓ వీడియో షేర్ చేశాడు. టాలీవుడ్‌లో పెళ్లి కాని హీరోలందరికీ సింగిల్ ఆర్మీ అనే వాట్సాప్ గ్రూపు ఉన్న సంగతి తెలిసిందే. అందులోంచి ఈ మధ్యే నిఖిల్, నితిన్, రానావంటి వారు పెళ్లి చేసుకుని అందులోంచి లెఫ్ట్ అయ్యారట. ఇక తాజగా తన వంతు వచ్చిందని చెబుతూ ప్రభాస్‌కి సారీ చెబుతూ లెఫ్ట్ అయ్యాడు.
అయితే సాయి ధరమ్ తేజ్ చేసిన ఈ ట్వీట్‌లో కొంత సమాచారం కూడా దాగి ఉంది. పూర్తి వివరాల కోసం రేపు ఉదయం పది గంటలకు వరకు వేచి ఉండండని పేర్కొన్నాడు. సాయి ధరమ్ తేజ్ ఈ ట్వీట్ తన సినిమా ప్రమోషన్ గురించి చేసి ఉంటాడని, పెళ్లి గురించి కానే కాదని ఓ వర్గం గట్టిగా సెటైర్స్ వేస్తోంది. ఇక కొందరు మాత్రం సాయి ధరమ్ పెళ్లి ఫిక్స్ అయినట్టుందని, అసలే ఇప్పుడు మెగా ఇంట నిహారిక పెళ్లి సందడి ఉంది కదా.. పనిలో పనిగా తేజుకు కూడా పెళ్లి చేయాలని ఫిక్స్ అయినట్టున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఒక వేళ సాయి ధరమ్ తేజ్ పెళ్లి వార్త అయి ఉంటే.. ఆ అమ్మాయి ఎవరు? వివరాలు ఏంటి? అనే విషయాలు తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.