ప్ర‌భాస్ హిందీ ప‌రిశ్ర‌మ‌కు వెళ్లిపోతే ఎలా?

డార్లింగ్ ప్ర‌భాస్ త్వ‌ర‌లోనే ఓ బాలీవుడ్ సినిమాలో న‌టించ‌నున్నాడ‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ తెర‌కెక్కించ‌నున్న భారీ పాన్ ఇండియా చిత్రంలో న‌టిస్తాడ‌ని.. ఇందులో హృతిక్ రోష‌న్ లాంటి స్టార్ హీరోకి కూడా స్కోప్ ఉంద‌ని ప్ర‌చారం సాగుతోంది. తెలుగు ప్రాజెక్టుల్ని ప‌క్క‌న పెట్టి ఇక డార్లింగ్ హిందీ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు వెళుతున్న‌ట్టేన‌న్న చ‌ర్చా సాగుతోంది.

ప్ర‌స్తుతం రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న రాధేశ్యామ్ (ప్ర‌భాస్ 20) కొద్ది పాటి పెండింగ్ చిత్రీక‌ర‌ణ పూర్త‌యిపోతుంది. అటుపై అత‌డు నాగ్ అశ్విన్ – అశ్వ‌నిదత్ బృందం నిర్మించ‌నున్న భారీ సైన్స్ ఫిక్ష‌న్ చిత్రంలో న‌టిస్తాడు. ఆ మూవీ త‌ర్వాత బాలీవుడ్ మూవీలో న‌టించేందుకు ప్ర‌భాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసే వీలుంద‌ని మాట్లాడుకుంటున్నారు. ఇదే ప్ర‌భాస్ కి తొలి స్ట్రెయిట్ హిందీ సినిమా అన్న మాటా వినిపిస్తోంది.

అయితే ప్ర‌భాస్ కి ఇప్ప‌టికే టాలీవుడ్ కి చెందిన‌ మూడు నాలుగు అగ్ర నిర్మాణ సంస్థ‌లు అడ్వాన్సులు ఇచ్చాయ‌ని వీళ్ల‌కు సినిమాలు చేయ‌డం కుద‌ర‌ద‌ని మ‌రో సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది. దిల్ రాజు.. మైత్రి న‌వీన్ స‌హా ప‌లువురు అడ్వాన్సులు ఇచ్చి డార్లింగ్ కోసం వేచి చూస్తుంటే అత‌డు హిందీ ప‌రిశ్ర‌మ‌కు వెళ్లిపోతే క‌ష్ట‌మే క‌దా? అన్న చ‌ర్చా వేడెక్కిస్తోంది. హిందీలో భారీ పాన్ ఇండియా సినిమా అంటే క‌నీసం రెండు మూడేళ్ల‌యినా చిత్రీక‌ర‌ణ‌కు ప‌డుతుంది. అంత‌వర‌కూ వీళ్లంతా వేచి చూడాల్సిందేనా? అన్న ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. మ‌రి దీనికి డార్లింగ్ ఏమ‌ని ఆన్స‌ర్ చేస్తాడో చూడాలి.