పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రి అవుతారా? .. ప్రస్తుతం అభిమానుల్లో హాట్ టాపిక్ ఇది. ఎందుకంటే, అవిభాజిత ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణ – ఆంధ్రప్రదేశ్‌గా విభజించిన తరువాత, ప్రజలు మొదట చంద్ర బాబు టీడీపీకి ఓటు వేశారు. సీఎంగా ఆయనకున్న అపారమైన అనుభవం రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి చెందుతుందని వారు భావించారు. అయితే ఆయన రాజధాని దాని చుట్టూ రియల్ వెంచర్లపైనే దృష్టి సారించి రైతుల్ని విస్మరించడంతో జనం ఓటు రూపంలో చెంప చెల్లుమనిపించారు.
ఆ ఐదేళ్లు జనాలు భ్రమల్లో ఉన్నారని ప్రూవైంది. దీంతో వైఎస్‌ఆర్‌సీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి కి ఓటు వేశారు. అయితే జగన్‌పై ప్రజల భ్రమలు త్వరలో వీడనున్నాయన్న ప్రచారం మొదలైంది. ఇద్దరు ప్రధాన గేమ్ ప్లేయర్స్ అయిన చంద్ర బాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డి ఇద్దరిపైనా భ్రమలు వీడి ఇకపై ప్రజలు మరో ప్రత్యామ్నాయం కోసం వేచి చూడడం ఖాయమని ఒక సెక్షన్ భావిస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాత్రమే ప్రత్యామ్నాయం.
కాబట్టి పవన్‌కు ఆంధ్రప్రదేశ్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని సెంటిమెంటుగానూ ఇది వర్కవుటవుతుందని జోశ్యం చెబుతున్నారు కొందరు. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుత సందిగ్ధావస్తను పవన్ సద్వినియోగం చేసుకోవడంలో సఫలమవుతారా? తేదేపాకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతారా? అన్నదే బిగ్ టాస్క్. ప్రజా సమస్యల కోసం పోరాడటం .. కష్టకాలంలో వెలుగు నింపే నాయకుడిగా పేరు తెచ్చుకోవడం.. నిరంతరం ప్రజల్లో ఉండడం ద్వారా పవన్ కి అనుకున్నది సాధ్యమవుతుంది. అయితే అన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి. కాలాన్ని తనవైపు మలుచుకునే నైపుణ్యం పవన్ కి ఉండాలని ఆయన డైహార్డ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.