త్రివిక్రమ్ మాటపైనే ‘ఎలక్షన్ క్యాంపైన్’ కు ఎన్టీఆర్ దూరం?

రీసెంట్ గా జరగిన తెలంగాణా ఎలక్షన్స్ లో ..హైదరాబాద్ కుకట్ పల్లి నియోజకవర్గం నుంచి నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని పోటీలో నిలిచిన సంగతి తెలిసిందే. సుహాసిని కోసం ఆమె సోదరులు ఎన్టీఆర్, కళ్యణ్ రామ్, ఇతర కుటుంబ సభ్యులు ప్రచారం చేస్తారని మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఎన్నికల ప్రచారానికి కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ దూరంగా ఉండిపోయారు.

కానీ తమ సోదరి సుహాసినిని టిడిపి తరుపున అభ్యర్థిగా ప్రకటించిన తరువాత ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సోదరి విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రెస్ నోట్ విడుదల చేసి అక్కడితో ఊరుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో సుహాసిని ఓడిపోయారు. ఇదంతా తెలిసిన విషయమే.

ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఎన్టీఆర్ ప్రచారంలో పాల్గొనకపోవడానికి బలమైన కారణం ఉందట. తన మిత్రుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రచారానికి దూరంగా ఉండాలని ఎన్టీఆర్ కు సూచించారట. ఈ విషయమై  ఆంగ్ల పత్రిక దక్కన్ క్రానికల్ లో కథనం వెలువడింది.

ముందుగా ఎన్టీఆర్ ప్రచారంలో పాల్గొనాలనే నిర్ణయించుకున్నారు కానీ…. కానీ ఈ సమయంలో అది సరైన నిర్ణయం కాదని,కెరీర్ బాగా సాగుతున్న ఈ తరుణంలో ఎలక్షన్స్ జోలికి వెళ్లవద్దని త్రివిక్రమ్ ఎన్టీఆర్ కు సుచించారని రాసుకొచ్చింది. అయితే ఇందులో ఎంతవరకూ నిజముందనేది త్రివిక్రమ్ కు, ఎన్టీఆర్ కు తెలియాలి.

ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ చివరగా నటించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం మంచి విజయం సాధించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యాక్షన్ డ్రామా… మాస్ ని, ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది. ఎన్టీఆర్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా అరవింద సమేత నిలిచింది. ఈ చిత్రంతో ఎన్టీఆర్, త్రివిక్రమ్ స్నేహితులుగా మారిపోయారనేది మాత్రం నిజం.