ఇన్సైడ్ టాక్ : “ఎన్టీఆర్ 30” రిలీజ్ పై ఓ స్టన్నింగ్ అప్డేట్ మీకోసం..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు దర్శకుడు కొరటాల శివతో ఒక మాసివ్ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వాల్సి ఉన్న ఈ చిత్రాన్ని దర్శకుడు ఇంకా అలా లేట్ చేస్తూ వస్తున్నాడు కానీ దీనిపై అయితే హైప్ ఎక్కడా కూడా తగ్గడం లేదు.

మరి ఈ సినిమాపై రీసెంట్ గానే ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ బయటకి రాగా దీనితో అయితే ఈ సినిమా కథ మార్చినట్టుగా తెలిసింది. మరి ఈ చిత్రం పై ఇప్పుడు అయితే ఇంకో క్రేజీ స్టన్నింగ్ అప్డేట్ బయటకి వచ్చింది.

ఈ అప్డేట్ ఏమిటంటే చిత్ర యూనిట్ ఈ సినిమాని రికార్డు నెంబర్ భాషల్లో ఒకేసారి రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట. మరి ఇంతకీ ఎన్ని భాషల్లో అంటే ఎన్టీఆర్ మాట్లాడగలిగే 9 భాషల్లో కొరటాల ఈ సినిమా ని పాన్ ఇండియా లెవెల్లో భారీ ఎత్తున రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

ఇది నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. మరి సినిమా రిలీజ్ కి అయితే ఎలా ఉంటుందో చూడాల్సిందే. ప్రస్తుతానికి ఇంకా హీరోయిన్ ఫైనలైజ్ కావాల్సి ఉంది. ఇక అనిరుద్ కూడా కొత్త కథకి సంగీతం సిద్ధం చేస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.