గాడ్ ఆఫ్ మాసెస్ పవన్ కళ్యాణ్ నుంచి ఓ సినిమా వస్తుంది అంటే ఆ మేనియా ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అందులోని ఒక సరైన సినిమా గాని పడి ఉంటే మాత్రం ఇంకో లెవెల్లో ఉంటుంది. అలా ఇప్పుడు రెండు సినిమాల కోసం అయితే ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అలాంటి చిత్రాల్లో దర్శకుడు హరీష్ శంకర్ తో మళ్ళీ గబ్బర్ సింగ్ తర్వాత చేస్తున్న సినిమా భవదీయుడు భగత్ సింగ్ కూడా ఒకటి. మరి ఈ సినిమా ఇంకా సెట్స్ వెళ్ళలేదు ఆల్రెడీ ఈ జూలై లేదా ఆగష్టు లో వెళ్లాల్సిన సినిమా ఇది అయినా కూడా ఇప్పుడు పవన్ కి పొలిటికల్ గా ఉన్న కమిట్మెంట్స్ రీత్యా మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది.
ఇక ఇప్పుడు ఈ సినిమా నిర్మాతలే మైత్రి మూవీ మేకర్స్ వారు పవన్ తో ఈ రెండు మూడు రోజుల్లో కీలక మీటింగ్ కి కలవనున్నట్టు తెలుస్తుంది. ఈ కాంబోలో సినిమా కోసం ఎన్నో ఏళ్ల కితమే వీరు డబ్బులు ఇచ్చేసారు. ఫైనల్ గా పవన్ ఓకే చెప్పి స్టార్ట్ అవుతుంది అనుకుంటే ఇప్పుడు ఇలా మారాయి పరిస్థితులు.
మరి ఈ మీటింగ్ లో ఏమవుతుందో అనేది రసవత్తరంగా మారింది. మరి పవన్ పై ఏమన్నా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా లేక వేరే మీటింగ్ కోసమా అనేది చూడాలి.