ఇన్సైడ్ టాక్ : పవన్ ఈ రెండు సినిమాలకి రెడీ అంటున్నాడా? అందుకే నో ఛేంజ్.!

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కన్నా ఇప్పుడు పొలిటికల్ గా ఎక్కువ బిజీగా కనిపిస్తుండడంతో నిర్మాతలు మరియు దర్శకుల గుండెల్లో కాస్త కంగారు గానే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ అయ్యిన పవన్ ని నమ్ముకొని స్టార్ట్ అవ్వాల్సిన సినిమాలు కొన్ని ఉన్నాయి.

మరి ఈ చిత్రాల్లో మధ్యలోకి మరో రీమేక్ ని పవన్ పనుల్లో పనిగా లైన్ లో పెట్టేసాడు. అయితే ఈ సినిమా షూటింగ్ సహా మరో సినిమా షూటింగ్ కోసం పవన్ అయితే రెడీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొదటగా వినోదయం సినిమాకి పవన్ డేట్స్ ఇవ్వగా నెక్స్ట్ భారీ సినిమా క్రిష్ తో ప్లాన్ చేసిన సినిమా హరిహర వీరమల్లు కోసం రెడీగా ఉన్నట్టు సినీ వర్గాల్లో ఇన్సైడ్ టాక్.

అందుకే గత కొన్ని రోజులతో పోలిస్తే పవన్ ఇప్పుడు కొద్దిగా తన లుక్ ని మార్చేశాడు. అలాగే దీనితో పాటుగా వినోదయం సినిమాలో కూడా హరిహర వీరమల్లు సినిమా లుక్ లోనే కనిపిస్తాడని సినీ వర్గాలు చెబుతున్నాయి. దీనితో అయితే ప్రస్తుతానికి బహుశా ఈ నెలలోనే పవన్ ఈ సినిమాల షూటింగ్ ని స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా భోగట్టా..

మరి వినోదయం రీమేక్ లో పవన్ తో పాటుగా సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తుండగా హాట్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్ గా ఎంపిక అయ్యినట్టు టాక్ ఉంది. మరి వేచి చూడాలి ఈ రెండు సినిమాలు ఎప్పుడు పట్టాలెక్కుతాయో అనేది.