ఇండస్ట్రీ టాక్ : ప్రభాస్ “ఆదిపురుష్” టీజర్ ని ఎప్పుడుకి లాక్ చేసారో తెలుసా?

ప్రస్తుతం బాలీవుడ్ సినిమా మేకర్స్ నుంచి వచ్చిన లేటెస్ట్ సినిమా “బ్రహ్మాస్త్ర” పాన్ ఇండియా లెవెల్లో భారీ వసూళ్లతో దుమ్ము లేపుతుంది. ఇక ఇదిలా ఉండగా బాలీవుడ్ నుంచే మన తెలుగు హీరో ప్రభాస్ హీరోగా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ హీరోయిన్ గా రాబోతున్న మరో భారీ పాన్ ఇండియా చిత్రం “ఆదిపురుష్” కూడా రెడీగా ఉంది.

మన తెలుగు దర్శకుల నుంచి సినిమాలు ఇప్పుడు బాగా డామినేట్ చేస్తుంగా కొందరు బాలీవుడ్ దర్శకులు మాత్రం పలు సెన్సేషనల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఇక ఈ ఆదిపురుష్ సినిమాని అయితే మేకర్స్ ఒక అందని ద్రాక్ష లానే ఉంచుతుండగా ఫైనల్ గా ఈ సినిమా టీజర్ కి గాను మేకర్స్ ఆల్రెడీ టైం ఫిక్స్ చేసినట్టుగా తెలిసింది.

అయితే దీనిని మొదట ప్రభాస్ బర్త్ డే కానుకగా అక్టోబర్ లో 23కి అలా ప్లాన్ చెయ్యగా ఇప్పుడు మరో క్రేజీ అప్డేట్ తెలుస్తుంది. చిత్ర యూనిట్ ఈ టీజర్ ని దసరా కానుకగా రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట.

అంటే ఎలా లేదన్నా వచ్చే నెల 5 లోపు టీజర్ పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై మాత్రం సరైన అప్డేట్ ఇంకా రావాల్సి ఉంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ రామునిగా కృతి సీతగా కనిపించనున్నారు.