ఇండస్ట్రీ టాక్ : ప్రభాస్ భారీ సినిమాలో సూర్య?? ఇంతకీ మ్యాటర్ ఏమిటంటే.!

ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న పలు సెన్సేషనల్ ప్రాజెక్ట్ లలో ఇండియాస్ బిగ్గెస్ట్ వరల్డ్ లెవెల్ డ్రామా “ప్రాజెక్ట్ కె” కూడా ఒకటి. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సినిమా కూడా ఒకటి అయితే ఈ సినిమా షాకింగ్ గా ఏకంగా 60 శాతం షూటింగ్ కి చేరుకోగా ఇప్పుడు సినిమా షూటింగ్ ని అయితే మేకర్స్ చేసేస్తున్నారు.

ఇక ఇదిలా ఉండగా ఈ అవైటెడ్ సినిమాలో మేకర్స్ పాన్ ఇండియా వైడ్ భారీ తారాగణంతోనే ప్లాన్ చేస్తున్నారు. అయితే ఎక్కువగా హిందీ నుంచి నటులు ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ టాక్ తమిళ సినీ వర్గాల నుంచి వినిపిస్తుంది. మరి వారు ఏమంటున్నారంటే..

ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ కి గాను తమిళ స్టార్ హీరో సూర్య ని సంప్రదించారట. మరి ఉన్న టాక్ ప్రకారం అయితే సూర్య ఈ సినిమాలో నటిస్తాడనే అంటున్నారు. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉంది అనేది తేలాల్సి ఉంది.

ఇంకా ఈ సినిమాలో అయితే హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె నటిస్తుండగా అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. అలాగే నిర్మాత సి అశ్వని దత్ ఈ సినిమాని 500 కోట్లకి బడ్జెట్ తో ప్లాన్ చేస్తుండగా వచ్చే ఏడాది సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.