ఇండస్ట్రీ టాక్ : పవన్ సినిమాలు స్టార్ట్ చేసే మూడ్ లో లేడా..?

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ తన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి బిజీ అయ్యాడు. అయితే ఇప్పుడు ఇంకా తన పర్సనల్  వర్క్స్ లోనే బిజీగా ఉండగా పవన్ అయ్యితే స్టార్ట్ చేసిన సినిమాల పరిస్థితి మరింత ఆందోళనగా మారుతూ వస్తుంది.

ఇప్పుడు తాను స్టార్ట్ చేసి ఆల్రెడీ ఉంచిన చిత్రం హరిహర వీరమల్లు షూటింగ్ కేవలం 55 శాతం మాత్రమే పూర్తి చేసుకుంది. దీనితో ఈ చిత్రం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా ఇంకా క్లారిటీ అయితే లేదు. మరి ఇప్పుడు అయితే ఇండస్ట్రీ వర్గాల లేటెస్ట్ సమాచారం ప్రకారం పవన్ ఇప్పుడుకి కూడా ఇంకా సినిమాలు స్టార్ట్ చేసే మూడ్ లో లేడట.

అందుకే తాను ఆల్రెడీ వీరమల్లు కి ప్రిపేర్ చేసిన లుక్ నుంచి బయటకి వచ్చేసి నార్మల్ అయ్యిపోయాడు. దీనితో పవన్ అయితే ఇప్పుడప్పుడే మళ్ళీ సినిమాలు స్టార్ట్ చేసే మూడ్ లో లేదని అంటున్నారు.

ఇప్పుడుకే పవన్ కమిట్ అయ్యి చెయ్యాల్సిన సినిమాలు రెండు ఉండగా ఇవి ఎప్పుడు మొదలు అవుతాయో కూడా లేని పరిస్థితి మళ్ళీ నెలకొంది అని చెప్పాలి. తాజాగా అయితే పవన్ తన పార్టీ కార్యాలయంలో సరస్వతి పూజలో పాల్గొన్నారు.