నాకు నలభై వచ్చినా సరే

ముప్పైఏళ్లు దాటితే చిత్రసీమలో అవకాశాలు తగ్గిపోతాయని భయపడేవారు. ఇప్పుడు ట్రెండ్‌మారింది. తమ వ్యక్తిగత విషయాల్ని చెప్పడానికి నవతరం నాయికలు ఏమాత్రం సంకోచించడం లేదు. పంజాబీ భామ తాప్సీది అనే పంథా. వయసు విషయాన్ని తాను అస్సలు పట్టించుకోనని చెబుతున్నది ఈ సుందరి. ఇటీవలే ఈ అమ్మడు 32వ వసంతంలోకి అడుగుపెట్టింది. నా దృష్టిలో ముప్పైఏళ్ల తర్వాత ప్రతి మనిషిలో పరిపూర్ణత లభిస్తుంది. తమ శక్తియుక్తులు పూర్తిగా తెలుసుకుంటారు. అదే 20ఏళ్ల వయసులో గుర్తింపు తాపత్రయం ఉంటుంది. పరిస్థితులు అయోమయంగా అనిపిస్తాయి. ఎనిమిదేళ్ల క్రితం నేను నటిగా పరిచయమైనప్పటి కంటే ఇప్పుడే ఆత్మవిశ్వాసంతో దూసుకుపోతున్నాను. 40 ఏళ్లొచ్చినా వయసు గురించి అస్సలు ఆలోచించను. సినిమా అంటేనే ఇతరుల జీవితాన్ని తెరపై పండించడం. అందుకు వయోపరమైన పరిమితులు ఏమీ ఉండవు. మన పాత్రకు న్యాయం చేస్తే చాలు. అందుకే నా యవ్వనంలోని రోజులకంటే ఇప్పుడే ఆనందంగా ఉన్నా అని చెప్పింది.