Megastar : మెగాస్టార్ తదుపరి చిత్రంలో ఆ హీరోయిన్ ను ఎక్స్ పెక్ట్ చేయొచ్చా…. చిరు మనసులోని మాట చెప్పకనే చెప్పేసారా…!

Megastar : మెగాస్టార్ చిరు ఈ మధ్య జోరు పెంచి వరుస సినిమాలతో బిజీ అయ్యారు. ఆచార్య, భోళా శంకర్, వాల్తేరు వీరన్న, గాడ్ ఫాదర్ అంటూ వరుస సినిమాలను లైన్ లో పెట్టేసారు. ఇక ఆచార్య లో కాజల్ అగర్వాల్ ఆయనకు జోడి గా నటిస్తుండగా గాడ్ ఫాదర్ లో నయనతార నటిస్తోంది. ఇక బాబీ డైరెక్షన్ లోని సినిమా కోసం శృతి హాసన్ ను ఎంపిక చేసారు. ఇక భోళాశంకర్ లో తమన్నాతో రొమాన్స్ చేయనున్నారు చిరు.

నాతో నటించమంటే కాదంటావా.. నేను హర్టు అని మొన్న మధ్యే సాయిపల్లవిని సున్నితంగా నిలదీశారు మెగాస్టార్ చిరంజీవి. స్టేజ్‌ మీద ఆమెతో కలిసి ఒక స్టెప్పు వేసి ఆ ముచ్చటనూ తీర్చేసుకున్నారు. ఇప్పుడు దాదాపుగా అటువంటి సీనే మళ్ళీ అయింది.. మిషన్ ఇంపాజిబుల్‌ ఈవెంట్‌లో తాప్సీతోను ఇలాగే చమత్కరించారు.

ఝుమ్మంది నాదం సినిమా రిలీజైనప్పుడే తాప్సీ అందానికి తాను ఫ్లాట్ అయ్యానన్నారు చిరూ. అప్పట్లో అనవసరంగా రాజకీయాల్లోకి వెళ్లానేమో.. లేకపోతే తాప్సీతో నటించే ఛాన్స్ దక్కేదని సూటిగా చెప్పుకున్నారు. దీంతో ఈ కాంబినేషన్ పై చర్చలు మొదలయిపోయాయి.చిరు నెక్స్ట్ మూవీ లో తాప్సీ ఉండొచ్చు చెప్పలేం అంటున్నారు అభిమానులు. చిరు వయసు పెరిగిన ఇంకా యంగ్ గానే ఉన్నారంటు మురిసిపోతున్నారు మెగా అభిమానులు.