తాప్సీకి ఝ‌ల‌క్ ఇచ్చిన పోలీసులు.. బిక్క‌మొహం పెట్టిన సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి

ఝుమ్మంది నాదం చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి తాప్సీ. తెలుగులో ఈ అమ్మ‌డికి కాలం క‌ల‌సిరాక‌పోవ‌డంతో బాలీవుడ్ చెక్కేసింది. అక్క‌డ విభిన్న క‌థా చిత్రాలు చేస్తూ స్టార్ స్టేట‌స్ పొందింది. పింక్ రీమేక్‌లో తాప్సీ అద్భుత న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ల‌భించాయి. సినిమాల‌తో జ‌నాల‌లో చైతన్యం తెచ్చే తాప్సీ ప‌బ్లిక్ గాను నిజాన్ని నిర్భ‌యంగా మాట్లాడుతుంటుంది. రీసెంట్‌గా ఓ హీరో భార్య వ‌ల‌న త‌న సినిమా ఆఫ‌ర్ పోయింద‌ని చెప్పుకొచ్చింది.

తాప్సీకి ట్రాఫిక్ పోలీసులు ఝ‌ల‌క్ ఇచ్చిన వార్త ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. బుల్లెట్‌పై హెల్మెట్ లేకుండా వెళుతున్న తాప్సీఈ ఫొటోను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. హెల్మెట్ లేకుండా బైక్ న‌డుపుతున్నందుకు గాను ట్రాఫిక్ పోలీసులు జ‌రిమానా విధించారు. ఈ విష‌యాన్ని తాప్సీ త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేసింది. అయితే ఈ బైక్ న‌డ‌పాల్సిన ప‌రిస్థితి ఎందుకు వ‌చ్చిందంటే అమ్మడు ప్ర‌స్తుతం ల‌క్ష్మీ రాకెట్ అనే సినిమా చేస్తుంది. ముంబై ప‌రిస‌రాల‌లో జ‌రుగుతున్న ఈ చిత్ర షూటింగ్‌లో భాగంగా బైక్ న‌డిపింది.

హెల్మెట్ లేకుండా బైక్ న‌డ‌ప‌డం సీసీ కెమెరాలలో న‌మోదు కావ‌డంతో ముంబై ట్రాఫిక్ పోలీసులు జ‌రిమానా విధించార‌ట‌. డెనిమ్ జీన్స్ విత్ జీన్స్ జాకెట్‌తో బుల్లెట్ న‌డుపుతున్న తాప్సీ ఇదే ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. హెల్మెట్ లేకుండా జ‌రిమానా ప‌డే కంటే ముందు.. అంటూ క్యాప్షన్ ఇచ్చింది. తాప్సీ ఫొటోకు నెటిజ‌న్స్ ప‌లు ర‌కాలుగా స్పందిస్తున్నారు. మంచి చెప్ప‌డ‌మే కాదు ఆచ‌రించాలి కూడా అని కొంద‌రు అంటుంటే మ‌రి కొంద‌రు అన్ని వేళ‌ల్లో జాగ్ర‌త్త‌గా ఉండాలి మ‌రీ అంటూ స్పందిస్తున్నారు