వరుస ట్రీట్ లతో ఆరోజు పవన్ ఫ్యాన్స్ కి పండగే..!

Bheemla Nayak

తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరోస్ లో గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. అయితే పవన్ పుట్టినరోజు ఈ సెప్టెంబర్ 2న రాబోతుండగా ఈ బిగ్ డే కి గాను పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ ప్లాన్ లు చేస్తున్నారు అయితే సినిమా పరంగా కూడ పవన్ ఫ్యాన్స్ పవన్ తరపున భారీ ట్రీట్ లు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది.

అయితే వీటిలో మొదటగా తన అవైటెడ్ ప్రతిష్టాత్మక చిత్రం “హరిహర వీరమల్లు” నుంచి ఒక ఏక్షన్ టీజర్ కన్ఫర్మ్ కాగా ఇది 40 సెకండ్స్ పాటు ట్రీట్ ఇచ్చే లెవెల్లో ఉంటుందని తెలుస్తుంది. ఇక దీనితో పాటుగా పవన్ నటించిన జల్సా సినిమా రీ మాస్టర్ ప్రింట్ ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుండగా దీనితో ఆ రోజు మరింత స్పెషల్ గా వారికి మారుతుంది.

అయితే దీనితో పాటుగా ఇతర సినిమాలకి సంబంధించి అయితే కొన్ని ఆసక్తికర అప్డేట్స్ కూడా రానున్నట్టుగా చెబుతున్నారు. దీనితో అయితే ఆ రోజు మాత్రం పవన్ ఫ్యాన్స్ కి గట్టి పండగే ఉంటుంది అని పవన్ సినీ వర్గాలు వారు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం అయితే పవన్ తన రాజకీయ పనుల్లో బిజీగా ఉండగా కొన్ని రోజుల్లో మరో రీమేక్ సినిమాని స్టార్ట్ చెయ్యనున్నాడు.