మెగాస్టార్ టైటిల్ తో మహేష్ బాబు !

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ తో భారీ సక్సెస్ ఖాతాలో వేసుకున్నారు. ఇక అదే జోష్ ‌లో ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ చేస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కతుంది. ఇదిలా ఉంటే మహేష్ బాబు అప్‌కమింగ్ మూవీ రాజమౌళి దర్శకత్వంలో ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

రాజమౌళితో సినిమా చేసేలోపే వంశీ పైడిపెల్లితో మూవీ కంప్లీట్ చేయాలని చూస్తున్నారట మహేష్ బాబు.

అంతేకాదు ఈ చిత్రానికి గతంలో మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ మూవీ ‘స్టేట్ రౌడీ’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. ఇందులో మహేష్ బాబు పక్కా మాస్ రౌడీ పాత్రలో కనిపించనున్నారని టాక్. ‘సర్కారు వారి పాట’ షూటింగ్ ఫినిష్ కాగానే ఈ సినిమా సెట్స్ మీదకు రానున్నారట మహేష్.

ఇందులో నిజానిజాల సంగతేమో గానీ మెగాస్టార్ టైటిల్‌తో సూపర్ స్టార్ సినిమా అని తెలుస్తుండటం ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ మూవీ టైటిల్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకు పెడుతున్నారని తెలుస్తుండటం హాట్ టాపిక్ అయింది.