రామానాయుడుకు రానా అంటే ఎందుకంత ఇష్టమో తెలుసా ?

దక్షిణ భారతం తో పాటు ఉత్తర భారతంలో కూడా ప్రజాదరణ వున్న నటుడు రానా దగ్గుబాటి . మూవీమొఘల్ రామానాయుడు మనవడిగా గా సురేష్ బాబు కుమారుడుగా 2010లో లో శేఖర్ కమ్ముల దర్శకత్వలో వచ్చిన “లీడర్ ” సినిమాతో పరిచయం అయ్యాడు . అంతకు ముందు స్టూడియో వ్యవహారాలూ, లేదా విసువల్ ఎఫెక్ట్స్ ఇంచార్జి గా ఉండేవాడు . క్రమంగా రానా నటనపై వున్న ఆసక్తితో “లీడర్ ” అయ్యాడు . ఈ సినిమా విజయవంతం కావడంతో తాత రామానాయుడు, తండ్రి సురేష్ బాబు సంతోషించారు .


ఇక అక్కడ నుంచి రానా నటుడుగా తన ప్రస్థానం మొదలు పెట్టాడు . దామ్మారో దం , నేను నా రాక్షసి ,నా ఇష్టం ,కృష్ణం వందే జగద్గురుమ్ ,దొంగాట, బాహుబలి, రుద్రమదేవి, సైజు జీరో ,ది ఘాజి ఎటాక్ , బాహుబలి కంక్లూషన్ ,నేనే రాజు నేనే మంత్రి, ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ , ఇవికాక రానా హిందీ ,తమిళ సినిమాల్లో కూడా నటించాడు . చాలా తక్కువ సమయంలోనే రానా నటుడుగా తనదైన ముద్ర వేశాడు . ఇప్పుడు చంద్ర బాబు పాత్రలో ఒదిగిపోయాడు అంటున్నారు . సినిమా అంటే రానాకు ప్రాణం . పాత్రోచితంగా నటించడం అతనికి ఇష్టం .
నిజానికి ఇప్పుడు అందరు రానా అని పిలుస్తున్నారు . రానా పూర్తి పేరు రామానాయుడు . తండ్రి మీద ఇష్టం , గౌరవంతో 1984న జన్మించిన తన మొదటి సంతానానికి సురేష్ బాబు ఈ పేరు పెట్టుకున్నాడు . తన పేరుతో వున్న రానాను రామానాయుడు బాగా గారాబం చేసే వాడు . సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించే సినిమాలకు రానాతో క్లాప్ , స్విచ్ ఆన్ చేయించేవాడు .


అయితే ఇంట్లో రామా నాయుడు అని పిలిచేటప్పుడు తండ్రి సురేష్ బాబు, తల్లి లక్ష్మి కి నాయనమ్మ రాజేశ్వరమ్మకు ఇబ్బందిగా అనిపించేది . అందుకే రామా నాయుడులో వున్న రెండు అక్షరాలూ తీసుకొని రానా అని పిలవడం మొదలు పెట్టారు . అక్కడ నుంచి రామానాయుడు రానా అయిపోయాడు .