వెండితెరపై అందాల ఆరబోతకు ఏమాత్రం అడ్డు చెప్పని బ్యూటీగా పాయల్ రాజ్ పుత్ పాపులరైంది. ఈ పంజాబీ బ్యూటీ తెరపై కనిపిస్తే చాలు ఆరు నుంచి 60వరకూ వయసుతో సంబంధం లేకుండా తెగ ఇదైపోతుంటారు. ఇక పాయల్ సోషల్ మీడియాల్లో నిరంతర ట్రీట్ ని ఫాలో అయ్యేవారిలో లేట్ ఏజ్ వాళ్లే ఎక్కువ.
అదంతా సరే కానీ పాయల్ రాజ్ పుత్ ప్లస్ 2లో ఎలా ఉండేది? అంటే ఇదిగో తాజాగా ఓ ఫోటో రివీలైంది. ప్రస్తుతం యువతరంలో ఈ ఫోటో జోరుగా వైరల్ అవుతోంది. పాయల్ స్వయంగా ఈ ఫోటోని షేర్ చేసింది. కాస్త బొద్దుగా ముద్దుగా ఉన్న ఈ అమ్మడు అప్పట్లోనే ముకు పుడక ధరించి కాలేజ్ లో కుర్రాళ్లను గగ్గోలు పెట్టించింది.
అప్పట్లోనే యూత్ గుర్తించి ఉండాల్సింది. అటు పంజాబీ పరిశ్రమ సహా ఇటు టాలీవుడ్ లోనూ పాపులరైన పాయల్ మునుముందు తమిళం .. హిందీ పరిశ్రమల్లోనూ అడుగులు వేయనుంది. ప్రస్తుతం కోలీవుడ్ లో నటిస్తోంది. తెలుగులో అవకాశాలు తగ్గాయి. కానీ ఇంకా కెరీర్ మిగిసిపోలేదు. బన్ని పుష్ప.. కమల్ హాసన్ భారతీయుడు 2లో ఐటెమ్ నంబర్లతో మురిపించనుందని ప్రచారం సాగుతోంది. కానీ అధికారికంగా ప్రకటించలేదింకా. ఇరుగు పొరుగు భాషల్లో పాయల్ క్రేజు పెంచుకునే పనిలో ఉంది. ఈలోగానే క్వారంటైన్ టైమ్ ని పాయల్ పొలాల్లో ఆటపాటలతో గడిపేస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.