ఆ పెద్ద హీరోకి హీరోయినే దొర‌క‌డం లేదా?

 (ధ్యాన్)
 
హీరోకి పిల్ల దొర‌క‌డం లేదు అని అన‌గానే వెంట‌నే పెళ్లి చేసుకోవ‌డానికేమో అనుకోకండి. సినిమాల్లో న‌టించ‌డానికే. కొంద‌రి స‌ర‌స‌న న‌టించ‌డానికి ఆల్రెడీ ర‌న్నింగ్‌లో ఉన్న హీరోయిన్లు సుముఖ‌త చూపించ‌లేదు. కొత్త‌గా వ‌చ్చేవారు ఫ్యూచ‌ర్‌ని దృష్టిలో పెట్టుకుని త‌ట‌ప‌టాయిస్తున్నారు.  తాజాగా ఆ కోవ‌లోకి మ‌రో సీనియ‌ర్ హీరో చేరారు. ఆయ‌న పేరు రాజ‌శేఖ‌ర్‌. ఎప్పుడూ కొత్త హీరోయిన్లను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసే రాజ‌శేఖ‌ర్ ఈ సారి ప్రశాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించే సినిమాలో కాస్త పేరున్న హీరోయిన్‌తో ప‌నిచేయాల‌ని అనుకున్నార‌ట‌. ఆప్ర‌య‌త్నంలో భాగంగానే శ్రియ‌, కాజ‌ల్ ను కూడా సంప్ర‌దించార‌ట‌. అయితే వారిద్ద‌రూ డేట్లు ఖాళీ లేవ‌న్నార‌ట‌. దాంతో రాజ‌శేఖ‌ర్ చేసేదేమీ లేక మ‌ర‌లా కొత్త హీరోయిన్ల అన్వేషణ మొద‌లుపెట్టిన‌ట్టు తెలుస్తోంది. హీరోయిన్ ఓకే కాగానే ఈ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌నుంది. ఎన్నో ఏళ్లుగా హిట్ కోసం ఎదురుచూసిన రాజ‌శేఖ‌ర్‌కు ఇటీవ‌ల ప్ర‌వీణ్ స‌త్తారు `గ‌రుడ వేగ‌`తో మంచి హిట్ సినిమాను అందించిన విష‌యం తెలిసిందే. ఆ హిట్ జోష్‌లో ఉన్న రాజ‌శేఖ‌ర్ త్వ‌ర‌లోనే ప్ర‌శాంత్ వ‌ర్మ సినిమాతో మ‌రో హిట్ అందుకుంటార‌ని, స్క్రిప్ట్ అంత బావుంద‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు.