ఒకప్పటి హీరోయిన్ స్నేహ తెలుగు, తమిళ భాషల్లో ఒక వెలుగు వెలిగింది. కానీ పెళ్లి చేసుకున్నాక చాలా వరకు హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోతాయి. ఇక దొరికేవి వదిన మొదలైన పాత్రలే. కానీ అదే వదిన పాత్ర చేసే హీరోయిన్లు అంత త్వరగా తల్లి, అత్త పాత్రలు చేయడానికి ఒప్పుకోరు. కానీ ఒకప్పటి హీరోయిన్ స్నేహ అందుకు భిన్నంగా తమిళ హీరో ధనుష్ చేసే కొత్త సినిమాలో తల్లి, అత్త పాత్ర పోషించడానికి ఒప్పుకున్నారు.
అయితే రెమ్యూనరేషన్ ఎక్కువ ఇచ్చి ఉండాలి లేదా స్క్రిప్ట్ లో ఆమెకు మంచి పాత్ర దక్కి ఉండాలి. ఏది ఏమైనా ‘సత్యమూర్తి’ లో వదిన పాత్ర పోషించిన స్నేహ త్వరగానే తల్లి, అత్త పాత్రకు ఓటేసిందని చెప్పాలి.
హీరో ధనుష్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తుండగా, ఆయన సరసన హీరోయిన్ మెహ్రీన్ జోడీ కడుతుంది.