అందాల శ్రుతిహాసన్ కెరీర్ పీక్స్ లో ఉండగానే వ్యక్తిగత జీవితమే తనకు ఇంపార్టెంట్ అని పూర్తిగా సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. అగ్ర కథానాయిక హోదాను సైతం పక్కన పెట్టేసి.. తాను మనసిచ్చిన విదేశీ యువకుడు మైఖేల్ కోర్సలేతో సహజీవనం సాగించింది. ఇక పెళ్లి చేసుకోవడమే తరువాయి అనుకుంటుండగానే అతడి నుంచి విడిపోయింది శ్రుతి. ఆ తర్వాత కథంతా తెలిసిందే. శ్రుతి ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తన తండ్రి గారు కమల్ హాసన్ సపోర్టుగానే నిలిచారు. తన కుటుంబ సభ్యులైన సారిక- అక్షర హాసన్ ఎంతో మద్ధతు పలికారు.
ఆ క్రమంలోనే ఇటీవల శ్రుతిహాసన్ తిరిగి పరిశ్రమలో రీఎంట్రీ ఇచ్చిన సంగతి విధితమే. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ సరసన క్రాక్ అనే చిత్రంలో నటిస్తోంది. బలుపు తర్వాత రెండోసారి రవితేజ సరసన ఛాన్స్ దక్కించుకుంది. ప్రస్తుత నిర్భంధం వల్ల షూటింగ్ నిలిచిపోయింది. చిన్నపాటి పెండింగ్ షూట్ పూర్తి చేసి ఈ మూవీని రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్రయత్నిస్తోంది.
అదంతా సరే కానీ.. సోషల్ మీడియాల్లో శ్రుతి వాలకం చూస్తుంటే ఏదో తేడా కొట్టినట్టే ఉందే! అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. అలా నాలుకు బయట పెట్టి గుడ్లు మిటకరిస్తూ బాగానే భయపెడుతోంది కానీ.. మరీ ఇలా పిచ్చి చేష్టలేమిటి? అంటూ కామెంట్లు వినిపిస్తున్నయి. ప్రేమలో విఫలం అవ్వడం వల్ల శ్రుతి మైండ్ ఏదో డైవర్షన్ లో ఉందంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. అయితే ఇలాంటివన్నీ సోషల్ మీడియా ఫాలోవర్స్ ని పెంచుకునేందుకేననేది కొందరి వాదన. మరి ఏది నిజం? ఏది అబద్ధం? అన్నది శ్రుతినే చెప్పాలి.