JFW క‌వ‌ర్: శ్రుతి సెల్ఫ్‌ క్రియేటివిటీ చూశారా?

శ్రుతిహాస‌న్ నెవ్వ‌ర్ బిఫోర్ హాట్ లుక్

మ్యాగజైన్ క‌వ‌ర్ షూట్ అంటేనే హీటెక్కించే కంటెంట్ అవ‌స‌రం. తాజాగా ప్ర‌ఖ్యాత జేఎఫ్‌.డ‌బ్ల్యూ క‌వ‌ర్ పేజీకి అందాల శ్రుతిహాస‌న్ ఇచ్చిన ఫోజు యూత్ లో హాట్ టాపిక్ గా మారింది. శ్రుతి నెవ్వ‌ర్ బిఫోర్ హాట్ లుక్ ఇది. ఇక ఆ ఇన్న‌ర్ అందాల్ని ఎర‌వేస్తూ జేఎఫ్ డ‌బ్ల్యూ క‌వ‌ర్ షూట్ సంథింగ్ స్పైసీగా ఆక‌ట్టుకుంటోంది.

ఇటీవ‌ల వృత్తిగ‌తంగా వ్య‌క్తిగ‌తంగా కొన్ని స‌మ‌స్య‌ల్ని ఎదుర్కొన్న శ్రుతిహాస‌న్ తిరిగి కంబ్యాక్ అయ్యేందుకు స్టార్ డ‌మ్ ని రాబ‌ట్టుకునేందుకు త‌న‌వంతు ప్ర‌య‌త్నాల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ర‌వితేజ స‌ర‌స‌న క్రాక్ చిత్రంలో న‌టిస్తోంది. బ‌లుపు టీమ్ వెల్ కం చెప్ప‌డంతో టాలీవుడ్ లో రీఎంట్రీ ఈజీ అయ్యింది.

తాజాగా రిలీజ్ చేసిన  JFW క‌వ‌ర్ పేజీపై ఉన్న ఫోటో తొలిసారి సెల్ఫ్ షాట్ క‌వ‌ర్ అని మ్యాగ‌జైన్ ప్ర‌తినిధులు వెల్ల‌డించారు. జూలై ఎడిష‌న్ క‌వ‌ర్ పేజీ శ్రుతి అందచందాల‌తో స‌ర్వాంగ‌సుంద‌రంగా త‌యారైంది. సెల్ఫ్ షాట్ అంటే.. శ్రుతి స్వ‌యంగా ఈ అలంక‌ర‌ణ అంతా చేసుకుని స్వ‌యంగా త‌న‌కు తానుగా కెమెరాలో బంధించిన ఫోటో ఇది. హైద‌రాబాద్ లో త‌న ఇంటి నుంచే ఈ ఫోటోని ఇత‌ర ఫోటోగ్రాఫ్స్ ని పంపింద‌ని తెలుస్తోంది.

శ్రుతి జేఎఫ్‌డ‌బ్ల్యూ క‌వ‌ర్ షూట్