హీరోయిన్ ఎక్స్ డ్ర‌గ్ డాన్‌కి జైలు త‌ప్ప‌దా?

డ్ర‌గ్స్ డాన్ ఇంటిని జ‌ల్లెడ ప‌డుతున్నారు!

బాలీవుడ్ క‌థానాయిక కిమ్ శ‌ర్మ మాజీ భ‌ర్త .. మాఫియా డాన్ అలీ పుంజానీ జైలుకు వెళ్ల‌క త‌ప్ప‌దా? అంటే ప్ర‌స్తుత స‌న్నివేశం చెబుతోంది. కెన్యా పోలీస్ అత‌డి కోసం వేటాడుతున్నారు. దేశం విడిచి వెళ్లినా తిరిగి రావాల్సిందిగా ఇప్ప‌టికే వార్నింగ్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం అలీ పుంజానీ ముంబైసా కౌంటీ ఇంటిని పోలీసులు స్వాధీనంలోకి తీసుకోవ‌డంతో పుంజానీ త‌ప్ప‌నిస‌రిగా పోలీసుల‌కు చిక్కాల్సిన ప‌రిస్థితి ఉంది. అత‌డు ముంబై (ఇండియా)లో త‌ల‌దాచుకున్నా తిరిగి త‌మ దేశానికి ర‌ప్పించేందుకు కెన్యా పోలీస్ సీరియ‌స్ గానే ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. ఇక పుంజానీకి అమెరిక‌న్ డ్ర‌గ్ డాన్స్ ఆకాషా బ్ర‌ద‌ర్స్ తో ఉన్న గొడ‌వ‌ల గురించి తాజాగా పోలీస్ విచార‌ణ‌లో రివీలైంది. కెన్యాలో జ‌రిగే అండ‌ర్ వర‌ల్డ్ వ్య‌వ‌హారాల్లో ఆ ఇరువురి మ‌ధ్యా గ‌న్ ఫైరింగ్ వంటి ఎటాక్స్ జ‌రిగాయ‌న్న రిపోర్ట్ ఉంది.

ప్ర‌స్తుతం అలీ పుంజానీ ఇంటిని జ‌ల్లెడ ప‌డుతున్న పోలీసుల‌కు అత‌డి ఇంట్లో పెద్ద ఎత్తున మాద‌క ద్ర‌వ్యాలు ప‌ట్టుబ‌డ్డాయి. ఇప్ప‌టికే అత‌డి ఇంట్లో పెద్ద మొత్తంలో డ‌బ్బును పోలీస్ స్వాధీన‌ప‌ర్చుకున్నారు. దీంతో కేసు మ‌రింత జ‌ఠిలం అవుతోంది. అత‌డిని జైలుకు పంప‌డం ఖాయమ‌ని చెబుతున్నారు. 44ఏళ్ల పుంజానీ లైఫ్ స్టైల్ గురించి ఆస‌క్తిక‌ర సంగుత‌లు తెలిశాయి. పుంజానీ 24ఏళ్ల సుశ్మిజ అనే యువ‌తిని పెళ్లాడాడు. కిమ్ శ‌ర్మ నిష్క్ర‌మ‌ణం త‌ర్వాత అత‌డు మ‌రో యువ‌తిని పెళ్లాడాడు. త‌న‌నే భార్య‌గా ట్రీట్ చేస్తున్నాడు. అయితే సినిమాలో చూపించిన‌ట్టే అలీ పుంజానీ లైఫ్ స్టైల్ పూర్తిగా
గ్యాంగ్ స్ట‌ర్ క‌థ‌నే త‌ల‌పించ‌డంపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.