ఒకరిని ప్రేమించి.. కొన్నాళ్ల పాటు సహజీవనం చేసి.. అటుపై కలతలతో విడిపోతే.. అప్పుడు అతడిని హిజ్రా అంటూ అవమానించడం సరైనదేనా? అతడు హిజ్రా అయితే అది ముందే తెలుసు కదా? ఇంతకాలం ఎందుకని దాచినట్టు? ఇప్పుడే గొడవలొచ్చాక ఆ సంగతిని బయటి ప్రపంచానికి ప్రచారం చేయడం కక్ష పూరిత చర్య కాదని అనుకోగలరా?
ప్రస్తుతం అలాంటి అనుమానమే వ్యక్తమవుతోంది సదరు కథానాయికపై. ఇద్దరి మధ్యా అంతా సవ్యంగానే సాగుతోంది అనుకుంటుండగానే బ్రేకప్ న్యూస్ వచ్చింది. ఆ ఇద్దరూ ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరేసుకున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలతో విరుచుకుపడ్డారు. తాజాగా సదరు హీరోయిన్ మరిన్ని వ్యవహారాల్ని తన ప్రియుడు గురించి బయటపెట్టింది. అతడు హోమో సెక్సువల్ అని మగాళ్లతోనూ సెక్స్ చేస్తుంటాడని.. ముంబై బాంద్రాలో అలాంటి మగాళ్లు చాలా మంది ఉన్నారని ఆరోపించింది. అంతేకాదు.. అతడు బైసెక్సువల్ అయిన ఓ బిగ్ షాట్ కి గాలం వేసే ప్రయత్నం చేశాడని అవన్నీ తనకు ముందే తెలుసు అని వెల్లడించడం అవాక్కయ్యేలా చేస్తోంది. అతడు ఎందరో మగువల జీవితాలతో ఆడుకున్నాడని ఇదివరకూ ఆరోపించిన ఆ ప్రియురాలు.. ఇప్పుడు బై సెక్సువల్ అంటూ పెద్ద బాంబ్ పేల్చింది.
ఇంతకీ ఈ ఎపిసోడ్స్ లో హీరో ఎవరు? హీరోయిన్ ఎవరు? అంటే.. హీరో పేరు కొరియోగ్రాఫర్ మెల్విన్.. హీరోయిన్ పేరు సనా ఖాన్. ఆ ఇద్దరి మధ్యా గత కొంతకాలంగా పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. అంతేకాదు.. ఈ గొడవలోకి అనవసరంగా సల్మాన్ ఖాన్ – సోహైల్ ఖాన్ బ్రదర్స్ పేర్లను లాగింది సనాఖాన్. సల్మాన్ సరసన అవకాశం వస్తే చేయనీకుండా తన మాజీ ప్రియుడు అడ్డుకున్నాడని కూడా ఆరోపించింది. ఇక దర్శకనిర్మాత సోహైల్ తో స్నేహం.. సల్మాన్ తో అనుబంధం ఎంతో గొప్పవి అని .. సల్మాన్ కి రాఖీ కట్టేంత చనువు ఉందని కూడా తెలిపింది. ఇంతకీ సనా ఆరోపిస్తున్న వాటిని పూర్తిగా ఆధారాలతో నిరూపించగలదా? ఇక మెల్విన్ మంచోడా కాదా? అన్నది చట్టమే కదా నిర్ణయించేది!! ప్రస్తుతం ఈ గొడవపై ఇన్వెస్టిగేషన్ సాగుతోంది.