మేదీపై ట్వీట్: సిద్దార్ద్ ఏంటి ప్లేట్ ఫిరాయించాడు?

హీరో సిద్దార్ద ఇన్నాళ్లుగా సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోడీకు వ్యతిరేకంగా ట్వీట్స్ వేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడుసార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్న వేళ ఆయన ప్లేట్ ఫిరాయించారు.

ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు తగ్గట్లు కేంద్రంలో భాజపా ఆధిక్యంలో దూసుకెళ్ళటం ఆయన్ని కలవరపరుస్తున్నట్లుంది. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్‌ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ ఓ ట్వీట్‌ చేశారు. మళ్లీ మోదీ ప్రభుత్వమే అధికారంలో రాకపోతే తాను ట్విటర్‌ నుంచి తప్పుకొంటానని అన్నారు. ఇంకెప్పటికీ ట్విటర్‌ ఖాతాను తెరవనని తేల్చి చెప్పారు. ‘అయేగా తో మోదీ హీ’ అన్న హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు.

అయితే ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల్లో భాజపానే మళ్లీ అధికారంలోకి వస్తుందని వెల్లడైనప్పుడు మాత్రం సిద్ధార్థ్‌ నెగిటివ్‌గా కామెంట్‌ చేశారు. ‘ఎగ్జిట్‌ పోల్స్‌ కేవలం అంచనాలు మాత్రమే. కానీ అసలైన ఫలితాల కోసం వేచి చూడాలి. ఈలోగా అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా కలిగే మార్పేమీ ఉండదని మనం గుర్తించాలి. గందరగోళానికి గురై ప్రయోజనం లేదు. అంచనాలను చూసి మురిసిపోవనవసరం లేదు’ అని పేర్కొన్నారు.