ప‌వ‌న్ వ‌ర్సెస్ ఆర్జీవీ ఎపిసోడ్‌లో నిఖిల్ ఫింగ‌రింగ్

శిఖరాన్ని చూసి కుక్క మొరుగుతోంది

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ `ప‌వ‌ర్ స్టార్` పేరుతో సినిమా తీస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆర్జీవీ థియేట‌ర్- ఏటీటీ వేదిక‌పై ఈ సినిమాని ఈనెల 25న ఉద‌యం 11 గంట‌ల‌కు రిలీజ్ చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజ‌ర్ లీక‌వ్వ‌గా.. అందులో ప‌వ‌న్ ని కించ‌ప‌రుస్తూ ఘాటైన స‌న్నివేశాల్ని చూపించారు ఆర్జీవీ. ప‌వ‌న్ గ‌త ఎన్నిక‌ల్లో ఓటమి పాల‌వ్వ‌డంపై పూర్తిగా సెటైర్ వేయ‌డం చాలామందికి న‌చ్చ‌డం లేదు. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ని ఘోరంగా అవ‌మానిస్తూ పంచ్ డైలాగుల‌తో ఈ సినిమాని సెటైరిక‌ల్ గా తెర‌కెక్కించ‌డంపై ప‌వ‌న్ అభిమానులు మండిప‌డుతున్నారు.

తాజాగా టాలీవుడ్ హీరో నిఖిల్ ట్విట్టర్ లో స్పందించారు. “శిఖరాన్ని చూసి కుక్క ఎంత మొరిగినా… ఆ మహా శిఖరం తల తిప్పి చూడదు… మీకు అర్థం అయిందిగా?“ అంటూ ట్వీట్ పెట్టారు. దీనికి `పవర్ స్టార్`.. `పవన్ కల్యాణ్` అనే హ్యాష్ ట్యాగ్స్ స‌హా ప‌వ‌న్ వీడియోని జోడించ‌డంతో త‌న ఫేవ‌రెట్ స్టార్ పై నిఖిల్ ఇలా అభిమానం చూపించార‌ని అర్థ‌మైంది.

నిఖిల్ ఆర్జీవీపై పంచ్ వేశార‌ని సూటిగానే అంద‌రికీ అర్థ‌మ‌వుతోంది. ఇంత‌కుముందు చాలాసార్లు ఆర్జీవీ వెకిలి వేషాల‌పై నిఖిల్ ఇలానే స్పందించి అభిమానం చాటుకున్నారు. టాలీవుడ్ లో నితిన్ – నిఖిల్ – బిగ్ బాస్ కౌశిక్ లాంటి హీరోలు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు అన్న సంగ‌తి తెలిసిందే.

Shikaram ni chusi Kukka entha Morigina.. a maha shikaram thala thippi chudadhu… meeeku Ardham ayyindi ga…
 

👍🏼

#powerstar #PawanKalyan