నేడు హైదరాబాద్‌లోని ఫిలించాంబర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బిగ్‌బాస్ అనుభవాలు, కంటెస్టెంట్ల ఆట తీరు, అందులో ఎవరు నటిస్తున్నారు?లాంటి విషయాలను వెల్లడించారు.
బిగ్‌బాస్ హౌస్‌లో తానేమీ డామినేషన్ చేయలేదని.. మన ఇంట్లో కూడా పిల్లలకు కండీషన్స్‌పెడితే నచ్చదు కదా అలాగే వారికి కూడా తాను నచ్చలేదని తెలిపింది. ఇంట్లో ఉప్పు,కారం కూడా సరిపోవడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోండంటూ వివరించింది. తన భర్తకు ఫుడ్ అంటే ఇష్టమని అది కావాలని ఇది కావాలని అడిగేదంటూ వితికా కిచెన్‌లోకి వచ్చేదని, గ్యాస్ పైనే హిమజ వేడి నీళ్లు పెట్టుకునేదని,అయితే ఇలాంటివన్ని షోలో ప్లే చేయలేదని.. తాను అరిచినవి మాత్రమే చూపించాడని తెలిపింది.