Hema: నాకు నందీ అవార్డు రావాల్సింది…కమిటీలో జయసుధ, సన ఉండి కూడా ఆపేసారు.. నటి హేమ!

Hema: ఎమ్మెస్ నారాయణ, గుండమ్మ లాంటి క్యారెక్టర్స్ వెళ్లిపోయాక మళ్లీ ఇప్పుడు కొత్తగా తీసే సినిమాల్లో ఎవర్ని పెట్టాలి అని తెలియక, ఆ క్యారెక్టర్స్ రాయకుండానే ఉంటున్నారని సినీ నటి హేమ అన్నారు. అలా తనకు కెరీర్‌లో కొంచెం గ్యాప్ వచ్చిందని ఆమె తెలిపారు. ఆ గ్యాప్‌లో ఉన్నపుడు సీరియల్ లేదా షో చేద్దామా అనుకొని ప్రొడక్షన్‌ వైపు వెళ్లాలని అనుకున్నానని ఆమె అన్నారు. ఏం చేసినా, ఎక్కడికెళ్లినా తాను మాత్రం ఇండస్ట్రీలోనే ఉంటానని, ఎందుకంటే తనకు ఇండస్ట్రీ అంటే ఇష్టం అని, అందుకే ఇండస్ట్రీలోనే ఉంటానని ఆమె స్పష్టం చేశారు.

కాబట్టి సినిమాలు ఉన్నా లేకపోయినా తనకు నెలకు కొంత అమౌంట్ వచ్చేటట్టు ప్రస్తుతం ప్లాన్ చేసుకున్నానని హేమ తెలిపారు. కాబట్టి తన లైఫ్ ఇప్పుడు చిల్లింగ్ మూడ్‌లో ఉందని, కాబట్టి చిల్ అవుదాం అని ఆమె చెప్పారు. ఇకపోతే తనకు కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాకు నందీ అవార్డు అందుకున్నానని ఆమె అన్నారు. కానీ తాను మాత్రం అష్టాచమ్మా సినిమాకు వస్తుందేమోనని అనుకున్నట్టు హేమ తెలిపారు. ఆ చిత్రంలో ఒక పెళ్లి కాని క్యారెక్టర్ చేశానని, ఆ పాత్ర తనకు బాగా నచ్చిందని ఆమె చెప్పారు.

ఆ తర్వాత ఈ మధ్య చేసిన సినిమాల్లో కూడా ఓ సినిమాకి నందీ రావాల్సింది అని హేమ అన్నారు. అపుడు ఆ జ్యూరీ కమిటీలో జయసుధ, సన ఉన్నారని వాళ్లేం చెప్పారంటే, ప్రాపర్ ఎండింగ్ ఉండే క్యారెక్టర్స్‌కి ఇద్దాం, డైరెక్టర్లు అంత బాగా రాయట్లేదని అన్నారని ఆమె చెప్పారు. అంతే కాకుండా ఈ అవార్డు గనక మనం ఇవ్వకపోతే డైరెక్టర్లు మంచి క్యారెక్టర్లు రాస్తారని, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు ఇంపార్టెన్స్ ఇస్తారని అనుకున్నట్టు వారు తనకు చెప్పారని ఆమె తెలిపారు. ఆ కారణంతో అప్పుడు కామెడీ కాటగిరీకే అవార్డు ఇవ్వలేదని ఆమె చెప్పారు. ఆ తర్వాత వాళ్లతో ఈ విషయంపై మాట్లాడానని, అవార్డు ఇవ్వకుండా ఉంటే మంచి క్యారెక్టర్స్ రాస్తారని ఎలా అనుకుంటారని తాను ప్రశ్నించినట్టు ఆమె వివరించారు.