Actress Hema: ‘మా’ అసోసియేషన్ ఎన్నికల సమయంలో జరిగిన కొన్ని సంఘటనల తర్వాత తనకు బ్లాక్ మెయిల్ కాల్స్ కూడా వచ్చాయని నటి హేమ చెప్పుకొచ్చారు. ఆ విషయం ప్రకాశ్ రాజ్ గారికి కూడా చెప్పానని ఆమె అన్నారు. తన దగ్గర ఐఫోన్ ఉందని, దాంట్లో రికార్డింగ్ ఆప్షన్ లేదని, అందుకే దాన్ని రికార్డు చేయలేకపోయానని సినీ నటి హేమ చెప్పారు.
ఇక వివరాల్లోకి వెళితే, అర్థరాత్రి 12 గంటలకు తనకు ఒక ఫోన్ కాల్ వచ్చిందని, ఏంటే కంప్లైంట్ ఇస్తున్నావ్, చంపేస్తాం అనే వాయిస్ వచ్చిందని ఆమె చెప్పారు. అది విని తాను గట్టిగా అరిచానని హేమ తెలిపారు. అంతే కాకుండా అది తాను విని అరిచేలోపల, అర్థం చేసుకునే వాళ్లు ఆ వ్యక్తి కాల్ కట్ చేశారని ఆమె అన్నారు. నిజానికి వాడు తనని బెదిరించడానికి ఫోన్ చేశాడని, కానీ తన వాయిస్ విని భయపడి వాడే పెట్టేశాడని ఆమె నవ్వుతూ చెప్పారు.
ఆ సమయంలో తనతో పాటు అక్కడ తన కూతురు, తన భర్త కూడా ఉన్నారని, ఆ ఎలక్షన్ల గురించే మాట్లాడుకుంటున్నారని ఆమె చెప్పారు. రేపు పొద్దున ఏం జరుగుతుందో ఏంటో అని వారు ఆలోచిస్తూ ఉన్న సీరియస్ సిచ్యువేషన్‌లో ఇలా ఫోన్ చేశారని, తాను అరవడంతో వాళ్లు ఫోన్ కట్ చేశారని ఆమె తెలిపారు. ఇక ఏం చేద్దామని చాలా ఆలోచించి ఓ ఫ్రెండ్‌కి ఫోన్ చేసి వేరే సిమ్‌తో రెడీగా ఉన్నానని, ఒకవేళ తాను ఇదే విషయం రుజువు లేకుండా చెప్తే హేమ అబద్దం చెప్తుందనుకుంటారని తాను అలా చేసినట్టు ఆమె వివరించారు. తరువాతి రోజు ఆ నెంబర్ పోలీసులకు పంపినా కూడా అది అన్‌నౌన్ నంబర్ అని ఆమె చెప్పారు. తాను రికార్డ్ చేద్దామనుకున్నానని, కానీ అవతలి వ్యక్తి మాట్లాడకుండా పెట్టేశాడని చెప్పారు. తనకు ఫోన్ వచ్చిన కంటే ముందే కరాటే కల్యాణీ-నరేష్‌ల మీద కేసు పెట్టానని హేమ చెప్పారు. తనకు మొత్తం 3 కాల్స్ వచ్చాయని, ఈ ఎన్నికలయ్యాక కూడా ఎవరో తనను ఏదో చేయాలని ప్రయత్నిస్తున్నాడని, కానీ తనను ఏమీ చేయలేరని, అరుంధతి సినిమాలో చెప్పినటట్టు నువ్వు నన్నేమీ చేయలేవురా అంటూ ఓ స్ట్రాంగ్ డైలాగ్‌ను విసిరారు హేమ.