ఈ వీడియో వారి కోసం మాత్రమే అంటూ ఆశు రెడ్డి పోస్ట్.. వైరల్ అవుతున్న కామం వీడియో?

డబ్ స్మాశ్ వీడియోల ద్వారా ఫేమస్ అయ్యి జూనియర్ సమంత గా పాపులర్ అయిన ఆశు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. డబ్ స్మాశ్ వీడియోల ద్వారా ఫేమస్ అయినా ఆశు రెడ్డి చల్ మోహన్ రంగా అనే సినిమాలో నటించే అవకాశం అందుకుంది. అయితే ఆ సినిమా ద్వారా సరైన గుర్తింపు లభించకపోవడంతో విదేశాలకు వెళ్లి చదువులో బిజీ అయ్యింది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 3 లో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం దక్కించుకుంది. ఈ సీజన్ లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమాయణం నడిపి బాగా పాపులర్ అయింది. ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత టీవీ షోలో పాల్గొనటమే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఆశు రెడ్డి తరచు తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది. పొట్టి బట్టలు ధరించి తన మేని అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇస్తూ సందడి చేస్తోంది. ఇలా ఆశు షేర్ చేసిన గ్లామర్ ఫోటోలు నిమిషాలలో వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా తన అందాలతో ఫాలోయింగ్ కూడా పెంచుకుంటోంది. అంతే కాకుండా ఆశు చేసే గ్లామర్ షో వల్ల విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. అయినా కూడా తన గురించి వినిపడుతున్న విమర్శలను పట్టించుకోకుండా తన పనిలో తాను బిజీగా ఉంటుంది.

ఇదిలా ఉండగా ఇటీవల ఆశు రెడ్డి షేర్ చేసిన ఒక వీడియో ఇంస్టాగ్రామ్ లో వైరల్ గా మారింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ ఈ అమ్మడిని తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో అందాల ఆరబోతకి హద్దులు చెరిపేసిన ఆశు రెడ్డి తాజాగా “కామా తురాణాం న: భయం.. న: లజ్జ” అంటూ దేశముదురు సినిమాలోని డైలాగ్‌ చెబుతూ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రీల్ షేర్ చేసింది. ఇక ఈ రీల్‌ను షేర్ చేస్తూ ‘నా ప్రొఫైల్‌లో తరచూ నా గురించి చెడుగా కామెంట్లు చేస్తున్న వాళ్లకు ఇది అంకితం’ అంటూ క్యాప్షన్ పెట్టింది. దీంతో ఈ వీడియోకు చాలామంది నెగెటివ్ గా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.