దిల్ రాజు తెలివైనోడు: ‘హలో గురు ప్రేమకోసమే’ప్రీ రిలీజ్ బిజినెస్

హీరో రామ్,  అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా దర్శ‌కుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన  చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే’. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు  నిర్మించిన  ఈ చిత్రం దసరా కానుకగా ఈ రోజు  విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. ఈ నేపధ్యంలో చిత్రం ప్రి రిలీజ్ బిజినెస్ ఎంత అయ్యిందనే విషయం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ విషయాలు చూద్దాం.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా  దిల్ రాజు 25 కోట్లకు అమ్మేసినట్లుగా ద్వారా తెలుస్తోంది.  నైజాంలో  6.5 కోట్లు, సీడెడ్ లో 3.5  కోట్లు, వైజాగ్ లో 2.5 కోచ్లు, ఈస్ట్ గోదావరి 1.60 కోట్లు, వెస్ట్ గోదావరి లో 1.40 కోట్లు, కృష్ణా లో 1.60 కోట్లు, గుంటూరు లో 2 కోట్లు, నెల్లూరు లో 0.90 కోట్లు బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 20 కోట్లు వరకూ బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటక లో 1.5 కోచ్లు, భారత్ లో మిగిలిన ప్రాంతాలు 0.50, ఓవర్ సీస్ లో రెండు కోట్లు బిజనెస్ అయ్యింది. దాంతో టోటల్ గా దాదాపు 25 కోట్లు వరకూ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

అయితే హీరో రామ్ కెరీర్,క్రేజ్  ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇంత భారీ మొత్తం రికవరీ చేయడం అంటే సవాలే. దిల్ రాజు పెద్ద భారమే రామ్ నెత్తిపై
పెట్టాడంటున్నారు. సినిమా ఘన విజయం సాధిస్తే తప్ప   డిస్ట్రిబ్యూటర్లు ఒడ్డున పడరు.