తెలుగు ఫిల్మ్ స్టార్, యంగ్ హీరో మహేష్ బాబు కు ఊహించని షాక్ తగిలింది. ఆయన జిఎస్టీ పన్నులు కట్టనందుకు పలు అకౌంట్లు అటాచ్ చేశారు ఐటి అధికారులు. పూర్తి వివరాలు కింద ఉన్నాయి చూడండి.
హైదరాబాద్ జిఎస్టీ కమిషనరేట్ గురువారం హీరో మహేష్ బాబు బ్యాంకు అకౌంట్లను బ్లాక్ చేశారు. బ్రాండ్ అంబాసిడర్ గా, యాడ్స్ ద్వారా రెవెన్యూ పొందిన మహేష్ బాబు సర్వీస్ టాక్స్ పే చేయకుండా ఎగ్గొట్టినట్లు జిఎస్టీ కమిషనరేట్ ఒక ప్రకటనలో తెలిపింది.
73.5 లక్షల కోసం మహేష్ బాబు కు చెందిన ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంకు అకౌంట్లను బ్లాక్ చేశారు అధికారులు. మహేష్ బాబు చెల్లించాల్సిన మొత్తం 18.5 లక్షలు. కానీ దానికి సంబంధించి ఫెనాల్టీ, వడ్డీ కలిపి 73.5 లక్షలకు బ్యాంకు ఖాతాలు నిలుపుదల చేసినట్లు కమిషనరేట్ తెలిపింది.
జిఎస్టీ హైదరాబాద్ శాఖ వెలువరించిన ప్రెస్ నోట్ కింద ఉంది. మరిన్ని వివరాలు చూడొచ్చు.